Avika Gor: చిన్నారి పెళ్లికూతురు అవికా అరాచకం... థైస్ చూపిస్తూ పొట్టి నిక్కర్ లో బోల్డ్ ఫోజులు! 

First Published May 21, 2022, 3:48 PM IST


చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ సైతం అందరిలా మారిపోయింది. మడిగట్టుకొని ఉంటే లాభం లేదని పరువాల విందుకు తెరలేపింది. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ తనలోని గ్లామర్ రుచి చూపిస్తుంది. 

Avika Gor

తాజాగా అవికా షార్ట్ , టాప్ ధరించి సూపర్ హాట్ ఫోటో షూట్ చేసింది. పొట్టి నిక్కర్ లో థైస్ కనిపించేలా బోల్డ్ ఫోజులిచ్చారు. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ కలిగిన అవికా తనలోని సరికొత్త కోణం పరిచయడం చేయడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. 
 

Avika Gor

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్న అవికా (Avika Gor)బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోయిన్ గా మారారు. సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్ చిత్రాలలో అవికా నటించారు. 
 

Avika Gor

2016 నుండి 2019 వరకు అవికా పరిశ్రమకు దూరమయ్యారు. దానికి కారణం పరిశ్రమలో ఎదురైన వేధింపులే అని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.కమ్ బ్యాక్ తర్వాత కన్నడ చిత్రం నటసార్వభౌమ మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు. రాజుగారి గది 3 మూవీలో లీడ్ హీరోయిన్ గా ఆమె నటించడం విశేషం. 
 

Avika Gor

ప్రస్తుతం అవికా ఖాతాలో పలు చిత్రాలున్నాయి. నాగ చైతన్య హీరోగా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న థాంక్యూ మూవీలో అవికా నటిస్తున్నారు. అలాగే ఓ హిందీ, రెండు తెలుగు చిత్రాలతో పాటు మరొక చిత్రం చేస్తున్నారు.

Avika Gor

24ఏళ్ల అవికా గోర్ ఆ మధ్య తన ప్రియుడ్ని కూడా లోకానికి పరిచయం చేసింది. మిలింద్ చాంద్వాని అనే వ్యక్తితో అవికా గోర్ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ తరచుగా విందులు, విహారాలలో పాల్గొంటున్నారు. త్వరలో ఈ జంట పెళ్లిపీటలెక్కే సూచనలు కలవు. 
 

Avika Gor

ఇక వెండితెరపై పద్దతిగా కనిపిస్తూ హోమ్లీ బ్యూటీ ఇమేజ్ సొంతం చేసుకున్న అవికా గోర్.. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేయడం సంచలనంగా మారుతుంది. ఆమె తరచుగా హాట్ ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తున్నారు. ఆ విధంగా తన ఫాలోవర్స్ ,ఇమేజ్ పెంచుకుంటున్నారు.

click me!