శృతి 2023 సంక్రాంతి హీరోయిన్ కానుంది. చిరంజీవి(Chiranjeevi), బాలయ్యల పండగ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. గతంలో అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే సంక్రాంతికి విడుదలవుతున్న రెండు పెద్ద చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. 2001 సంక్రాంతికి నరసింహనాయుడు, మృగరాజు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు.