అవి దగ్గరగా చూపిస్తూ నిధి అగర్వాల్ బోల్డ్ సెల్ఫీ... పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్ళు!

First Published May 31, 2023, 10:55 PM IST

నిధి అగర్వాల్ బోల్డ్ సెల్ఫీతో కాకరేపుతుంది. దొండపండు లాంటి పెదాలు దగ్గరగా చూపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిధి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Nidhhi Agerwal

పేరుకు తగ్గట్లే అందాలు నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది నిధి అగర్వాల్. ఈ హాట్ బ్యూటీ క్రేజీ సెల్ఫీతో మరింత టెంపరేచర్ పెంచేసింది. నిధి దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. కుర్రాళ్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 

Nidhhi Agerwal

మరో వైపు నిధి అగర్వాల్ వరుస ప్లాప్స్ ఆమె సతమతమవుతున్నారు. 2022లో ఆమె 'హీరో' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో పర్వాలేదు అనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో చేరింది.

Nidhhi Agerwal

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు అంతకంతకూ ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాది విడుదల కావచ్చు. 
 


నిధి అగర్వాల్ ఆశలన్నీ హరి హర వీరమల్లు మీద పెట్టుకుంది. పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల చేయనున్నారు. హరి హర వీరమల్లు హిట్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటిస్తున్నారు. 

హరి హర వీరమల్లుతో పాటు ఓ తమిళ చిత్రంలో నిధి నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక 2021లో నిధి ఈశ్వరన్, భూమి అనే రెండు తమిళ చిత్రాలు చేశారు. ఆ రెండు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.
 


నిధి కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ క్లీన్ హిట్ మూవీగా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ మూవీలో రామ్ హీరోగా నటించారు. నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో వసూళ్లు దుమ్మురేపింది. ఆ రేంజ్ హిట్ మరలా ఆమెకు దక్కలేదు.

ఇక హీరోయిన్ గా ఎదగాలంటే టాలెంట్ కాదు లక్ ముఖ్యమని నిధి గట్టిగా నమ్ముతుంది. ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. స్క్రిప్ట్ దశలో కథలను జడ్జి చేయడం సులభం కాదు. కాబట్టి సక్సెస్ లక్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పింది. 

click me!