బోల్డ్ అండ్ బ్యూటిఫుల్... బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో ఏంజెల్ లా దర్శనమిచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా

First Published Jul 2, 2021, 4:02 PM IST

సుదీర్ఘకాలం నుండి టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలుతుంది తమన్నా. తెలుగు తెరకు పరిచయమై 15ఏళ్ళు దాటిపోగా ఆమె క్రేజ్, మేనియా తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా అందరు టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా వన్నె తరగని గ్లామర్ తో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు.

ప్రస్తుతం నాలుగు చిత్రాల వరకు తెలుగులో తమన్నా చేస్తున్నారు. వరుణ్-వెంకీల మల్టీస్టారర్ ఎఫ్ 3 మూవీలో నటిస్తున్న తమన్నా, యంగ్ హీరో సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం అనే మూవీ చేస్తున్నారు.
undefined
అలాగే నితిన్ మాస్ట్రో మూవీలో తమన్నా నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేస్తున్నారు. మొదటిసారి తమన్నా ఈ తరహా రోల్ చేయడం విశేషం. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న మాస్ట్రో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
undefined
ఇక గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీమార్ మూవీలో తమన్నా లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. కోచ్ జ్వాలా రెడ్డిగా వెండితెరను షేక్ చేయనున్నారు. సీటిమార్ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుండగా, తమన్నా రోల్ ఆసక్తి రేపుతోంది.
undefined
నవాజుద్దీన్ సిద్దిఖీకి జంటగా బోల్ చుడియా అనే హిందీ చిత్రం చేస్తుంది తమన్నా. అలాగే హిందీ క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మీ మూవీలో తమన్నా నటించగా విడుదల కావాల్సి ఉంది. మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు.
undefined
ఆమె నటించిన డిజిటల్ సిరీస్లు నవంబర్ స్టోరీ, లెవెన్త్ హౌర్ ఆదరణ దక్కించుకున్నాయి. ముఖ్యంగా నవంబర్ స్టోరీ లో తమన్నా నటన ఆకట్టుకుంది. మరోవైపు టెలివిజన్ ఎంట్రీకి సిద్ధమైంది. భారీ ఎత్తున్న ఓ వంటల ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు తమన్నా. a
undefined
ఇక లేటెస్ట్ గా తమన్నా ఫోటో షూట్ వైరల్ గా మారింది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో తమన్నా మెరిసిపోగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అటైర్ కి సలాం అంటున్నారు.
undefined
click me!