Payal rajput: నాభి నుండి పాదం వరకు మొత్తం ముద్దులే.. సెక్సీ బీస్ట్ డ్రెస్ లో పాయల్ పాప నయా గ్లామర్ షో

First Published Nov 25, 2021, 10:58 AM IST

సరికొత్త గ్లామర్ షోకి పాయల్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది అమ్మడు స్కిన్ షో రోజురోజుకూ హద్దులు దాటుతుండగా, ఫ్యాన్స్ కి మాత్రం ప్రతిరోజూ పండగ అవుతుంది. తాజాగా పాయల్ ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. 


సెక్సీ బీస్ట్ బ్రాండ్ కి చెందిన టాప్, ప్యాంట్స్ లో హాట్ హాట్ ఫోజులిచ్చింది. రెడ్ లిప్స్ డిజైన్ కలిగిన పాయల్ ప్యాంటు మరింత హాట్ నెస్ రాజేసింది. ఆ డ్రెస్ లో ఆమె బోల్డ్ గా తయారయ్యారు. పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటో షూట్ పై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా పాయల్ (Payal rajput)గ్లామర్ కి స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఊపేస్తుంది అనుకున్నారు. ఆర్ ఎక్స్ 100 హిట్ తో ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని భావించారు. అలా జరగకపోవడంతో వచ్చిన ఆఫర్ వదలకుండా చేసుకుంటూ వెళుతుంది. 

ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. పాయల్ తో పాటు పూర్ణ, ఈషా రెబ్బా 3 రోజెస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 


గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటిలో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం. 
 

హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ కూడా పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. సరైన బ్రేక్ కోసం పాయల్, ఆది చేస్తున్న ప్రయత్నాలు కిరాతక నెరవేరుస్తుందని భావిస్తున్నారు. 

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 


సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. 

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. 

 పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 

click me!