గాలి కొడితే జారిపోయేలా ఉన్న టాప్, ఉన్నా లేనట్లే.. ట్రెండీ వేర్ లో నభా వేడి పరువాల విందు!

First Published Sep 2, 2021, 8:59 AM IST

మతి పోగొట్టే అందాలు, చూడగానే కవ్వించే పరువాలు నభా నటేష్ సొంతం. నటనలో కూడా మేటి అనిపించుకున్న నభా నటేష్ కి మాత్రం కాలం కలిసి రావడం లేదు. 

2015లో విడుదలైన వజ్రకాయ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నభా నటేష్. అనంతరం మరో రెండు కన్నడ చిత్రాలలో ఆమె హీరోయిన్ ఆ నటించారు. 
 

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు కోసం నభా ను కన్నడ పరిశ్రమ నుండి దిగుమతి చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో  నన్ను దోచుకుందువటే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. ఆ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. 
 

అనంతరం దర్శకుడు రవిబాబు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన అదుగో మూవీలో ఆమె నటించడం. ఓ పంది పిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు. 


అయితే ప్లాప్స్ లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ మూవీలో తెలంగాణా పోరీ రోల్ ఆఫర్ చేశాడు. రఫ్ అండ్ మాస్ రోల్ లో నభా సహజంగా నటించి, అరిపించింది. ఆ మూవీ సూపర్ హిట్ కాగా, నభా టాలీవుడ్ లో మొదటి హిట్ అందుకుంది. 


ఇస్మార్ట్ శంకర్ హిట్ నేపథ్యంలో సోలో బ్రతుకే సో బెటర్, డిస్కో రాజా చిత్రాలలో ఆమెకు ఆఫర్స్ దక్కాయి. సోలో బ్రతుకే సో బెటర్ పర్వాలేదనిపిస్తే... డిస్కో రాజా ప్లాప్ గా నిలిచింది. 
 


2021లో అల్లుడు అదుర్స్ మూవీతో పలకరించినా ప్రయోజనం లేకుండా పోయింది. హిట్ తరువాత మూడు పరాజయాలు అందుకున్న నభా నటేష్ పై  నమ్మకం సడలినట్లు ఉంది. అందుకే ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. 


హిందీ చిత్రం అంధాదున్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో మూవీలో నితిన్ తో జతకట్టింది. ఈ మూవీ ఓటిటిలో విడుదల కావడం ఒకింత నిరాశ పరిచే అంశమే. 

తాజాగా డాటెడ్ ప్రింట్ టాప్, ప్యాంటు ధరించి స్టైలిష్ లుక్ లో కాక రేపింది ఇస్మార్ట్ భామ. గాలికొడితే జారిపోయేలా ఉన్న స్లీవ్ లెస్ టాప్ లో లేత పరువాలు ఆరబోస్తూ చెమటలు పట్టించారు. నభా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

click me!