సుమక్క కుక్క వీడియో, అనసూయ హాట్ వీడియో... బాధ్యత లేదా అంటూ బూతుపురాణం అందుకున్న హీరో శివాజీ!

First Published Feb 7, 2021, 10:46 AM IST

ఆరు నెలలకోసారి ఆటం బాంబులా పేలుతాడు హీరో శివాజీ. ఏపీకి అన్యాయం జరిగిపోతుంది మొర్రో అంటూ ఏకవరువు పెడతారు. ఆయనకు మెళకువ రాగానే మేలుకోండి యువతా... మీలో చావ లేదా అంటూ విప్లవ గళం అందుకుంటారు.

కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆయన మరలా మైకు ముందుకు వచ్చేలా చేసింది. ఏపీకి అన్యాయం జరుగుతున్న వేళ ఎవరూ బాధ్యత తీసుకోరేంటి అంటూ ఆవేశంతో ఊగిపోయారు.
undefined
శివాజీ తన ఉపన్యాస పూనకంలో మునిగిపోయి సంబంధం లేని సుమ, అనసూయలను సీన్ లోకి లాగారు. సుమ, అనసూయల వీడియోలకు ఉన్న ఆదరణ అమరావతి ఉద్యమానికి లేదని అన్నారు శివాజీ.
undefined
సుమక్క కుక్కతో ఆడుకున్న వీడియో భలే ఉందిగా కదా.. అని హెడ్డింగ్ పెడితే ఆ వీడియోకి 4-5 మిలియన్స్ వ్యూస్ వస్తాయి అన్నాడు.
undefined
అలాగే అనసూయ అందాలు చూడండి.. అంటూ ఓ వీడియో అప్లోడ్ చేస్తే దానికి 8-9మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. కానీ అమరావతి ఉద్యమం పేరున ఓ వీడియో చేస్తే దానికి కనీసం వెయ్యి వ్యూస్ రావడం లేదన్నాడు శివాజీ.
undefined
ఇక్కడ నేను సుమ, అనసూయలను తప్పుబట్టడం లేదని, యువత ఆలోచన ధోరణి అలా ఉంటుందని శివాజీ తన ఘాటు వ్యాఖ్యలకు వివరణ ఇచ్చాడు.
undefined
రాజధాని లేని ఏపీ, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్న యువత, బాధ్యత లేకుండా నాయకులు ప్రవర్తిస్తుంటే ప్రశ్నించే నాథుడే లేదని శివాజీ ఫైర్ అయ్యారు.
undefined
రాజకీయ నాయడు మంచోడు చెడ్డోడు అనేది ఎవరూ చూడడం లేదని, తమ కులపోడు అయితే చాలని అనుకుంటున్నారు అన్నారు.
undefined
హీరోల విషయంలో కూడా ఫ్యాన్స్ పేరుతో గుడ్డలు చించుకుంటూ బాధ్యత లేకుండా యువత ప్రవరిస్తున్నారంటూ శివాజీ విరుచుకుపడ్డాడు. మొత్తంగా శివాజీ నేటి రాజకీయ పరిస్థితులపై ఓ సీన్ క్రియేట్ చేసి వెళ్లిపోయారు.
undefined
click me!