ఎన్టీఆర్‌-నీల్‌లకు షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?.. ఇదేం ట్విస్ట్!

Published : May 18, 2024, 06:32 AM IST
ఎన్టీఆర్‌-నీల్‌లకు షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?.. ఇదేం ట్విస్ట్!

సారాంశం

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన టైటిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే అదే పేరుతో ఇప్పుడు మరో సినిమా తెరకెక్కుతుంది.   

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేసన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20న ఈ మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుందట. ఇప్పటికే ఈమూవీని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు షూటింగ్‌ డిటెయిల్స్ తోపాటు సినిమా టైటిల్‌ని కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మేరకు సినిమా టైటిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో రావాల్సిన ఈ మూవీకి `డ్రాగన్‌` అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టారట. అది చర్చనీయాంశం అవుతుంది. మరో రెండు రోజులు దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్‌, నీల్‌కు షాక్‌ ఇచ్చాడు మేకర్స్. `డ్రాగన్‌` పేరుతో ఓ మూవీని ప్రకటించారు.  అశ్వత్‌ మారిముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నటీనటులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కల్పతి బ్రదర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. కాలేజ్‌ బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుందట. వరల్డ్ స్టూడెండ్‌ ఆఫ్‌ ది డెకేడ్‌ అనే క్యాప్షన్‌ ఆసక్తికరంగా ఉంది. 

ఇది తమిళ సినిమా అని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్‌, నీల్‌ది తెలుగు బేస్డ్ గా రూపొందుతుంది. రెండు వేర్వేరు భాషలు కావడంతో ఆ సమస్య ఉండదు. కానీ ఇది పాన్‌ ఇండియా మూవీ. అన్ని భాషల్లో ఆ పేరుతో టైటిల్ లేకుండా చూసుకోవాలి. చిన్న సినిమా అని లైట్‌ తీసుకున్నా, రిలీజ్‌ టైమ్‌లో అవి పెద్ద సమస్యలు వస్తాయి. మరి దీన్ని నీల్‌ మామల ఎలా డీల్‌ చేస్తాడో చూడాలి. అయితే ఎన్టీఆర్‌ సినిమాకి ఈ టైటిల్‌ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకునే ముందే దీన్ని ప్రకటించినట్టు సమాచారం. 

ఇక ఎన్టీఆర్‌ సినిమాని ప్రశాంత్‌ నీల్‌ ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభిస్తారట. 2026 రిలీజ్‌ టార్గెట్‌గా సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో `సలార్‌ 2`పై ఫోకస్‌ పెట్టారు. వచ్చే నెల నుంచి ఈ మూవీని ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే సెకండ్‌ పార్ట్ కి సంబంధించిన షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యింది. ప్రభాస్‌పై కొన్ని సీన్స్ చేయాల్సి ఉందని, క్లోజప్‌షాట్స్ వంటివి షూట్‌ చేయాల్సి ఉందట. అందుకే వాటిని రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. అ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్స్ కంప్లీట్‌ చేసి వచ్చే ఏడాది దీన్ని రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. ఓ వైపు `సలార్‌ 2` పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తూనే ఎన్టీఆర్‌ మూవీని చిత్రీకరించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం