
ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే టాపిక్ తెచ్చేవారు. ఆయన కూడా చాలా ఓపిగ్గా త్వరలోనే అన్నట్లు సమాదానం ఇచ్చేవారు. ఇప్పుడు మరోసారి ప్రబాస్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అందుకు కారణం ప్రభాస్ తన జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తిని త్వరలో పరిచయం చేయబోతున్నాడంటూ ఉదయాన్నే ఒక పోస్ట్‌ను పంచుకోవటే. దీంతో అతడి పెళ్లి ప్రకటన రాబోతోందని అందరూ భావించారు.అక్కడితో ఆగితే బాగుండేది కానీ ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు పాయిల్ రాజ్ పుత్ ని ప్రచారం మొదలెట్టేసారు. అందుకు కారణం ఉంది.
రెండు రోజుల క్రితం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ "నేను ఎవరికైనా డార్లింగ్‌గా ఉంటాను" అని పాయల్ పోస్టు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాయల్ ప్రభాస్ గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ప్రభాస్ ఇతరులకు ఆహారం అందించడం ఎలా ఇష్టమో చెప్పింది. .. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో పాయల్ కూడా తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఆయన తనకు కొంత సమయాన్ని ఇస్తే తనకోసం ఒకరోజును డేడికేట్ చేస్తానని, తన చేత్తో వంట చేసి స్వయంగా తినిపిస్తానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ వీడియోని, ఈ పోస్టులని కంపైల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
అయితే.. ప్రభాస్, పాయల్ పెట్టిన రెండు పోస్టులు ఒకేరకంగా, దాదాపు ఒకే సమయంలో రావడంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ పుణ్యమా అంటూ ప్రభాస్- పాయల్ మధ్య మ్యారేజ్ ట్రాక్ నడుస్తోంది. ఈ ఇంటర్వ్యూలు, పాయల్ పోస్టులు ప్రభాస్ పెళ్లికి లింక్ చేసేస్తున్నారు. ప్రభాస్ - పాయల్ ప్రేమలో ఉన్నారని, వారి పెళ్లి ప్రకటన రాబోతోందని వార్తలు రాసేసారు. అయితే ఈ వ్యవహారంలో ఎంత నిజముందో ఏమిటో ఎవరికీ అక్కర్లేదు.
ప్రభాస్ అసలు ఆ అమ్మాయి పాయిల్ ని ఎందుకు చేసుకుంటాడనే ఆలోచన లేకుండా వద్దంటూ పోస్ట్ లు. కొంత మంది అభిమానులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా ఉన్నారు. ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఏదైమైనా ఇక్కడ గమనించాల్సింది మరో విషయం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేసిన ఒక్క ఇన్స్టా పోస్ట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవటమే. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రేండింగ్ లో నడుస్తోంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ ఛానల్స్ సైతం ప్రభాస్ పోస్ట్ ని బ్రేకింగ్ న్యూస్ గా వస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవాలి.
ప్రభాస్ వేసిన పోస్ట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ముందు ఖుషీ అయ్యారు. కొంపదీసి పెళ్లి వార్త చెబుతున్నాడా? ఏంటి అంతా షాక్ అయ్యారు. అయితే ఆ తరువాత అదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నాడని తెలిసి నిరుత్సాహపడ్డారు. ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో తను షేర్ చేసిన స్టోరీ.. ‘కల్కి 2898 AD' మూవీకి సంబంధించిందే అని సాయంత్రానికి క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్
ప్రభాస్ పెళ్లి కోసం గత కొన్నేళ్లుగా అభిమానులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న హీరోలు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే..44 ఏళ్లు ఉన్న ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అంత మాట్లాడుకుంటున్నారు.పెళ్లి చేసుకునే విషయంపై ప్రభాస్ ను గతంలో చాలామంది అడిగినా ఆయన సూటిగా జవాబివ్వలేదు. ఏటేటా తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు.
గతంలో హీరోయిన్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా బాహుబలి సినిమా తర్వాత అనుష్క కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోవడం కోసమే కొత్త సినిమాలు అంగీకరించలేదనే వార్తలు వెలువడ్డాయి. అయితే, తామిద్దరం మంచి స్నేహితులమని ఇటు ప్రభాస్, అటు అనుష్క క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడింది.
ఆ తర్వాత కూడా హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఆదిపురుష్ సినిమా తర్వాత వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ కావడంతో వీరి ప్రేమ నిజమేనని ఫ్యాన్స్ కూడా భావించారు. తర్వాత కొన్ని రోజులకు కృతి సనన్ వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ప్రభాస్, కృతి సనన్ ప్రేమించుకుంటున్నారనే ప్రచారానికి తెరపడింది. ప్రభాస్ ఇన్ స్టా స్టేటస్ తో హీరో పెళ్లి గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. ప్రభాస్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కృష్టంరాజు భార్య శ్యామల దేవి కూడా ఈ ఏడాది ఎలాగైనా ప్రభాస్‌కు పెళ్లి చేస్తామని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ఈ అప్డేట్ పెళ్లి గురించే అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మరి ప్రభాస్ పెళ్లి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.