చీరలో సైడ్ అందాలు చూపిస్తూ చంపేస్తున్న హేబా పటేల్.. కుమారి మత్తు చూపులతో కుర్రాళ్లకు మైకమే.!

First Published Oct 2, 2022, 2:26 PM IST

యంగ్ బ్యూటీ హేబా పటేల్  (Hebah Patel) చీరకట్టులో అందాలను ప్రదర్శిస్తోంది. కుమారి స్టన్నింగ్ ఫొటోషూట్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా గ్లామర్ విందుతో అభిమానులను ఖుషీ చేస్తోంది. 
 

‘కుమారి 21 ఎఫ్’తో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు  దక్కించుకుంది యంగ్ బ్యూటీ హేబా పటేల్. ఈ మూవీలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో యూత్ లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 

కొన్నాళ్లు  హేబా పటేల్ సినిమాల జోరు తగ్గించిందనే చెప్పాలి. ఇటీవల మళ్లీ రైజ్ అవుతోంది. మరిన్ని ఆఫర్స్ కోసం వీలైనంత వరకు గ్లామర్ రోల్స్ నూ నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ లో  అందాల విందు చేస్తూ అలరిస్తోంది. చివరిగా ‘రెడ్’చిత్రం ద్వారా ఐటెం సాంగ్స్ లో నటించిన విషయం తెలిసిందే.

ఇటు సినిమాల్లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ నెట్టింట కూడా సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. అందాల విందు చేస్తూ నెటిన్లను అట్రాక్ట్ చేస్తోంది. యంగ్ బ్యూటీ  గ్లామర్ ప్రదర్శనకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.
 

తాజాగా హేబా పటేల్ బ్లూ శారీలో నెట్టింట తళుక్కున మెరిసింది. శారీలో సైడ్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. మత్తు చూపులతో  మాయజేస్తోంది. బొద్దుగా, ముద్దుగా మారిన హేబా ట్రెడిషనల్ లుక్ లోనూ అదరగొడుతోంది.  వరుస ఫొటోషూట్లు  చేస్తున్నఈ బ్యూటీ కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది.
 

రీసెంట్ గా ‘ఆహా’లోకి హేబా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railwaystation) వచ్చింది. పల్లెటూరి మహిళ పాత్రలో హేబా అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే వ్యూయర్ షిప్ ను కూడా దక్కించుకుంటోంది.

ఈ ఏడాది హేబా చేతిలో రిలీజ్ కు సిద్ధంగా మూడు, నాలుగు చిత్రాలు ఉన్నాయి. తెలుగుతో  పాటు తమిళ చిత్రాల్లోనూ ఆఫర్లు అందుకుంటూ సినిమాల జోరు పెంచుతోంది. తెలుగులో ‘తెలిసినవాళ్లే’,‘గీత’ చిత్రాల్లో నటించగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తమిళంలోనూ ‘వల్లాన్’ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయగా, ప్రస్తుతం ‘ఆద్య’ మూవీలో నటిస్తోంది. 
 

click me!