సల్మాన్ ఖాన్ తో నటించేందుకు మృణాల్ ఠాకూర్ అంత చేసిందా.. అయినా హ్యాండిచ్చిన సల్లు భాయ్.!

First Published Oct 6, 2022, 5:46 PM IST

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్  (Mrunal Thakur) ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ లా సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తోనూ నటించాలని ఎంతగానో ప్రయత్నించినా ఫలించలేదంట.

మరాఠి భామా, యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్రేజ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరిగింది. నార్త్ కు మాత్రమే పరిచయం అయినా ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కేవలం ఓవర్ నైట్ స్టార్ డమ్ తో సౌత్ ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకుంది.
 

తెలుగులో రూపొందించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ  ‘సీతా రామం’ (Sita Ramam)లో మృణాల్ ఠాకూర్ ‘సీత’ పాత్రలో నటించి మెప్పించింది. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటుసంపాదించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో ‘సీతామహాలక్ష్మి’గా పేరొందింది.
 

బాలీవుడ్ లో అప్పటికే స్టార్ హీరోల సరసన  నటిస్తూ వస్తోంది మృణాల్ ఠాకూర్.  మరాఠి ఫిల్మ్స్ తో కేరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ అనతి కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని షాకిచ్చింది. బాలీవుడ్ గ్రీక్ వీరుడు Hrithik Roshan, జాన్ అబ్రహం, ఫర్హా అక్తర్, కార్తీక్ ఆర్యన్, షాహిద్ కపూర్ తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

అయితే తన కేరీర్ ప్రారంభంలోనే మృణాల్ ఠాకూర్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందంట. కానీ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డానని మృణాల్ తానే స్వయంగా చెప్పింది. అయినా చిత్రం నుంచి  తనను తొలగించి మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంపిక చేశారని చెప్పింది.
 

మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరీర్ బిగినింగ్ లో చాలా స్ట్రగుల్స్ ను ఎదురుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన  ‘సుల్తాన్’ (Sultan)లో హీరోయిన్ గా ఎంపికైందంట. ఈ మూవీ కోసం మృణాల్ ఏకంగా 11 కిలోల బరువు కూడా తగ్గిందంట.  అంతేకాకుండా ఫైటింగ్ కూడా నేర్చుకుందని చెప్పింది.
 

కానీ తనకు బదులుగా  సుల్తాన్ లో హీరోయిన్ గా అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క శర్మను ఎంపిక చేశారంట. తనను తీసేయడానికి రీజన్ ఏంటో తెలియదని చెప్పుకొచ్చింది.  అంత  కష్టపడ్డా అవకాశం కోల్పోయినందుకు కాస్తా బాధపడినట్టు తెలిపింది.  ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యింది. 2014లో మృణాల్ కేరీర్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పిప్పా, పూజా మేరీ జాన్, ఆంఖ్ మిచోళీ, గుమ్రా’  చిత్రాల్లో నటిస్తోంది.
 

click me!