బిగ్‌బాస్‌ ముందు కంటతడి పెట్టుకున్న హారిక.. సోహైల్‌ ఏం చేశాడు?

Published : Oct 21, 2020, 10:56 AM IST

బిగ్‌బాస్‌4, 44వ రోజు ఆట బాగా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కొంటె రాక్షసులకు, మంచి మనుషుల టీమ్‌కి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ ప్రాసెస్‌లో హారికని ఏడిపించారు. 

PREV
16
బిగ్‌బాస్‌ ముందు కంటతడి పెట్టుకున్న హారిక.. సోహైల్‌ ఏం చేశాడు?

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఏడో వారం కొనసాగుతుంది. ఈవారం ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టాడు బిగ్‌బాస్‌. కొంటె రాక్షసుల టీమ్‌లో అరియానా, మెహబూబ్‌, అఖిల్‌,అవినాష్‌, హారిక ఉండగా, మంచి మనుషుల టీమ్‌లో నోయల్‌, అభిజిత్‌, లాస్య, అమ్మా రాజశేఖర్‌, దివి, సోహైల్‌, మోనాల్‌ ఉన్నారు. 

26

రాక్షసుల టీమ్‌ హౌజ్‌లో విధ్వంసం సృష్టిస్తుంటారు. అన్నింటిని పాడు చేస్తుంటారు. మంచి మనుషులు వాటిని ఓపికతో ఎదుర్కొనాలి. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్ లను పూర్తి చేయాలి. రెండో టాస్క్ లో హారికని మంచి మనుషుల టీమ్‌ బాగా ఇబ్బంది పెట్టింది. 

36

ఈ టాస్క్ లో మంచి మనుషులు వంద ప్రమిదలు చేయాలి. వాటిని రాక్షసుల టీమ్ చెడగొడుతుండాలి. అవి పూర్తి చేసిన తర్వాత ఒకరిని పట్టుకుని మంచి మనిషిగా మార్చాల్సి ఉంటుంది. మెహబూబ్‌ కోసం ట్రై చేయగా, ఆయన దొరకలేదు. హారిక దొరికింది. 

46

సోహైల్‌.. హారికని పట్టుకున్నాడు. తన టీమ్‌ సహాయాన్ని ఆమె కోరుకోగా, ఎవరూ రాలేదు. దీంతో ఇద్దరు మంచి మనుషులు హారికని బిగ్గరగా నొక్కి పట్టారు. దీంతో హారిక చాలా ఇబ్బంది పడింది. తాను బలవంతంగా మంచి మనిషిగా మారుతున్నానని బిగ్‌బాస్‌ ముందుకొచ్చి చెప్పింది. 
 
56

తాను మంచి మనిషిగా మారడం ఎవరికీ ఇష్టం లేదని, లగ్జరీ బడ్జెట్‌లో తాను ఒక్క వస్తువుని కూడా ముట్టుకోనని చెబుతూ ఏడ్చింది. 

66

అంతకు ముందు హారిక మంచి మనుషుల టీమ్‌ని బాగానే ఇబ్బంది పెట్టింది. అమ్మ రాజశేఖర్‌కి పసుపు సూరి, మంచు గడ్డలు వేసింది. హారికని నిలువరించే ప్రయత్నంలో
సోహైల్‌, హారిక ఒకరిపై ఒకరు పడి దొర్లారు. ఇవన్నీ హారికని ఇబ్బంది పెట్టాయని చెప్పొచ్చు. అందుకే ఆమె ఏడ్చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories