ఈఫిల్‌ టవర్ సాక్షిగా హన్సికకి ప్రపోజ్‌ చేసిన ప్రియుడు.. ఉబ్బితబ్బిబ్బయిన ఆపిల్‌ బ్యూటీ.. ఫోటోలు వైరల్‌

First Published Nov 2, 2022, 11:22 AM IST

యాపిల్‌ బ్యూటీగా, పాల బుగ్గల సుందరిగా పాపులర్‌ అయిన హన్సిక త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది. ఆమె ప్రియుడినే మ్యారేజ్‌ చేసుకోబోతుంది. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఆఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

హన్సిక తన ప్రియుడిని పరిచయం చేసింది. చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు సోహైల్‌ కతురియా తనకు ప్రపోజ్‌ చేసిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా తనకు ప్రపోజ్‌ చేయడం ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది. దీంతో హన్సిక ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఆనందంలో ఉప్పొంగిపోతుంది. ఈ సందర్భంగా `ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా` అని పేర్కొనడం హైలైట్‌గా నిలచింది.
 

హన్సిక చాలా రోజులుగా వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే నిజమైంది. ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌ సోహైల్‌ కతురియాని ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. అయితే అతను హన్సికకి జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోయేలా తన ప్రేమని ప్రపోజ్‌ చేశాడు. పెళ్లి చేసుకునే ప్రపోజ్‌ ఈఫిల్‌ టవర్‌ వద్ద పెట్టగా, హన్సిక మరో మాట లేకుండా ఓకే చెప్పడం విశేషం. అయితే ఇదంతా ఓ ప్లాన్‌ ప్రకారమే వాళ్లు చేయడం విశేషం. 
 

ప్రస్తుతం హన్సిక, సోహైల్‌ కథురియా ప్రపోజ్డ్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాబోయే ఈ జంటకి సినీ సెలబ్రిటీలు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. అందుతున్న సమచారం మేరకు డిసెంబర్‌ 4న వీరి వివాహం జరగనుందని సమాచారం. జైపూర్‌లోని ముంటోడా ప్యాలెస్‌ లో చాలా గ్రాండ్‌ స్కేల్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది. 
 

హన్సిక బాలనటిగా కెరీర్‌ ప్రారంభించింది. `దేశముదురు` సినిమాతో హీరోయిన్‌గా మారింది. తెలుగు సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. అల్లు అర్జున్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో హన్సిక మొదట సన్యాసిగా కనిపించడం విశేషం. ఆ తర్వాత బన్నీ ప్రేమలో పడి మామూలు అమ్మాయిగా మారుతుంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన  ఈచిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని సాధించింది. 

హీరోయిన్‌గా చేసిన తొలి చిత్రమే హిట్‌ కావడంతో అందరి దృష్టి హన్సికపై పడింది. పైగా చూడ్డానికి ఆపిల్‌ పండులాంటి అందం కావడంతో ఆడియెన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. మేకర్స్ ఆమెని వదల్లేదు. దీంతో వరుసగా హన్సికకి ఆఫర్లు వచ్చిపడ్డాయి. 
 

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది హన్సిక. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రవితేజ, నితిన్‌, మంచు విష్ణు, సందీప్‌ కిషన్‌, రామ్‌ వంటి వారితో ఆడిపాడింది. మంచి విజయాలు అందుకుంది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి సరైన ఆఫర్లు రావడం లేదు. దీనికితోడు బలమైన పాత్రలు రావడం లేదు. దీంతో తెలుగుకి బ్రేక్‌ ఇచ్చి తమిళంపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పుడు అక్కడ రాణిస్తుంది. అదే సమయంలో తెలుగులోనూ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది హన్సిక ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలుండటం విశేషం. 
 

click me!