బూతులు ఎక్కువైనయా? పర్లేదు కదా ! అంజలి చేత కూడా బూతులు

First Published May 26, 2024, 10:19 AM IST

నేను ఒక సినిమాలో బూతులు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఇదే విషయాన్ని నా పాత్రకు డబ్బింగ్ చెప్పేటప్పుడు మా టీమ్‌కి కూడా చెప్పాను. 

విశ్వక్‍సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంపై చాలా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మే 31న థియేటర్లలోకి రానుంది. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. పక్కా మాస్ క్యారెక్టర్‌ను విశ్వక్ చేస్తున్నారు. దీంతో హైప్ బాగా ఉంది . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ట్రైలర్ నిన్న  (మే 25) రిలీజ్ చేసారు. ఇక ఈ ట్రైల ర్ లో బూతుల డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. అదే విషయం నిర్మాత నాగ వంశీ సైతం ట్రైలర్ లాంచ్ స్టేజిపై ప్రస్తావిస్తూ ...బూతులు ఎమన్నా ఎక్కువైనయా? పర్లేదు కదా ఆ మాత్రం ఉంటే! అన్నారు. అయితే ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 


నీ సినిమాల్లో బూతులు కామన్ కదా అంటున్నారు. మహేష్ సినిమా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టిని గుర్తు చేస్తున్నారు. సినిమాల్లోకి సమర్దవంతంగా బూతులను తీసుకువస్తున్న ఘనత నాగవంశీదే అని చెప్తున్నారు. అంతకు ముందు తీసిన మ్యాడ్ సినిమాలనూ బూతులు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. డబ్బులు సంపాదించటం కోసం ఇలా జనాల్లోకి బూతులు వదలటమేంటని మరికొందరు ఈ వీడియోని పెట్టి కామెంట్ చేస్తున్నారు. ఆ వంకన ఈ ట్రైలర్ మరింత పాపులర్ అవటం గమనించవచ్చు. 
 

Gangs Of Godavari


 "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ట్రైలర్ ను హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్‌లో అభిమానుల కేరింతల మధ్య విడుదల చేశారు. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, తన కెరీర్ లో ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అన్నాడు విశ్వక్ సేన్. "లంకల రత్న" అనే శక్తివంతమైన పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు చాబా బాగుంది.
 


 తనదైన ఆహార్యం, అభినయంతో పాత్రకు నిండుదనం తీసుకొచ్చాడు. "లంకల రత్న" పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆ పాత్ర ప్రయాణం ఎలా ఉండబోతుందో చూపించిన తీరు.. సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. 
 

Gangs of Godavari


ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి అంజలి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. "ఈ సినిమాలో నేను రత్నమాల పాత్రలో నటించాను. నేను ఇంతకు ముందు చేసిన పాత్రలకు ఇది చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఒక సినిమాలో బూతులు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఇదే విషయాన్ని నా పాత్రకు డబ్బింగ్ చెప్పేటప్పుడు మా టీమ్‌కి కూడా చెప్పాను. నిజానికి నేను రియల్ లైఫ్‌లో కూడా బూతులు వాడను. అందుకే రత్నమాల పాత్ర కోసం దర్శకుడు నన్ను సంప్రదించడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది." అంటూ అంజలి చెప్పంది.


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్‍తో సీరియస్‍గా సాగింది. యువ రాజకీయ నాయకుడు రత్నాకర్ పాత్రలో యాక్షన్, డైలాగ్‍లతో విశ్వక్ అదరగొట్టాడు. మాస్ ఇంటెన్స్‌ లుక్‍తో మెప్పించాడు. మనుషుల్లో మూడు రకాలు.. “ఒకటోది నాసిరకం.. రెండోది బోసిరకం.. మూడోది నాణ్యమైన రకం” అని గోపరాజు రమణ్ చెప్పే డైలాగ్‍తో ట్రైలర్ షురూ అయింది.

ఆ తర్వాత రత్నాకర్‌గా విశ్వక్ ఎంట్రీ ఉంది. ఎన్నికల ప్రచారంలో మద్యం బాటిళ్లపై, బిర్యానీ పొట్లాలపై ఫొటోలతో లేబుళ్లు.. డబ్బులు పెంచడం ఇలా పక్కా లోకల్ పాలిటిక్స్ కనిపించాయి. ఈ ట్రైలర్లో టైగర్ రత్న (విశ్వక్) నోటి నుంచి “నాకు తెలిసిందల్లా ఒకటే.. మన మీదకు ఎవడైనా వస్తే.. వాడి మీద పడిపోవడమే” అంటూ విశ్వక్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. “మనుషులు మూడు రకాలు ఆడాళ్లు, మగాళ్లు, రాజకీయ నాయకులు” అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ఎండ్ అయింది. ట్రైలర్లో నేహా శెట్టి స్క్రీన్ టైమ్ కొంచెమే ఉంది.

Gangs of Godavari


మొత్తంగా 2 నిమిషాల 18 సెకన్లు ఉన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ పక్కా రస్టిక్ పొలిటికల్ డ్రామాగా ఇంటెన్స్‌గా ఉంది. విశ్వక్‍సేన్ యాక్షన్, గెటప్ అదిరిపోయాయి. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. అతడి టేకింగ్ ఈ ట్రైలర్లో ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌కు తగ్గట్టు సాగింది.


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్‍, నేహా శెట్టితో పాటు అంజలి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది, సాయికుమార్, మధునందన్ కీలకపాత్రలు పోషించారు. విశ్వక్ హీరోగా ఆదికి ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్ దక్కింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మే 31వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది.

click me!