నాగ్‌ అశ్విన్‌ హిట్‌ సెంటిమెంట్‌గా భావించే హీరోయిన్‌ ఎవరో తెలుసా? అందుకే రిపీట్‌ చేస్తున్నాడా?

Published : Jun 25, 2024, 03:59 PM IST
నాగ్‌ అశ్విన్‌ హిట్‌ సెంటిమెంట్‌గా భావించే హీరోయిన్‌ ఎవరో తెలుసా? అందుకే రిపీట్‌ చేస్తున్నాడా?

సారాంశం

నాగ్‌ అశ్విన్‌కి హిట్‌సెంటిమెంట్‌ ఉందని తెలుస్తుంది. ఓ స్టార్‌ హీరోయిన్‌ని ఆ సెంటిమెంట్‌గా భావిస్తున్నాడట. ఆమెని తన మూవీస్‌లో కంటిన్యూ చేస్తున్నాడట నాగ్‌.   

నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ గా రాణిస్తున్నాడు. `కల్కి 2898ఏడీ` హిట్‌ అయితే పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోతాడు. రాజమౌళి సరసన చేరతాడు. పది సినిమాల రాజమౌళి, మూడు సినిమాలు నాగ్‌ అశ్విన్‌ ల రేంజ్‌ సేమ్‌ కాబోతుంది. ఇప్పుడు `కల్కి` రిజల్ట్ పైనే అన్ని ఆధారపడి ఉన్నాయి. సినిమాకి అనుకున్నంత బజ్‌ అయితే లేదు. రెండో ట్రైలర్‌ తర్వాత ఫర్వాలేదనిపిస్తుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్‌లో మాత్రం దుమ్మురేపుతుంది. ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేయబోతుంది `కల్కి`. 

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాని సరికొత్త విజువల్‌ వండర్‌గా రూపొందించారు. మహాభారతంలోని అంశాలను, భవిష్యత్‌ కాలానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. విష్ణువు పదో అవతారమైన కల్కి కాలాన్ని ఇందులో చూపించబోతున్నారని, అది ఊహాత్మకంగా నాగ్‌ అశ్విన్‌ చెప్పబోతున్నారని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్‌ భైరవ పాత్రలో కనిపిస్తున్నారు. మరి కల్కి ఎవరనేది పెద్ద ప్రశ్న. భైరవనే కల్కినా అనేది ట్విస్ట్ గా ఉండబోతుందని సమాచారం. 

ఇక ఇందులో చాలా మంది హీరోలు కనిపించబోతున్నారు. అశ్వథ్థామగా అమితాబ్‌ బచ్చన్‌, హస్కిన్‌ గా నెగటివ్‌ పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపిస్తారు. దీపికా పదుకొనె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందంలు కూడా ఉన్నారు. వీరితోపాటు శోభన, మాళవిక నాయర్‌ కూడా ఉన్నారు. అలాగే విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌, నాని, రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ, మృణాల్‌ ఠాకూర్‌ కూడా కనిపిస్తారని సమాచారం. 

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ.. నాగ్‌ అశ్విన్‌కి ఫ్రెండ్‌. `ఎవడే సుబ్రమణ్యం`కి ముందు నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది. ఆ స్నేహంతోనే తన ప్రతి సినిమాలో విజయ్‌ ఉండేలా చూసుకుంటున్నాడు నాగ్‌. `ఎవడే సుబ్రమణ్యం` చిత్రంలో విజయ్‌ పాత్రనే హైలైట్‌ అవుతుంది. ఆ తర్వాత `మహానటి`లోనూ విజయ్‌, సమంతల జంట బాగా ఆకట్టుకుంది. హైలైట్ అయ్యింది. ఇప్పుడు నాగ్‌ మూడో సినిమా `కల్కి`లోనూ అతను ఉంటాడని అంటున్నారు. అర్జునుడి పాత్రలో విజయ్‌ కనిపిస్తారని సమాచారం. 

ఇదిలా ఉంటే ఆయనతోపాటు మరో హీరోయిన్‌ని కూడా కంటిన్యూ చేస్తున్నాడు నాగ్‌ అశ్విన్‌. ఆమె ఎవరో కాదు, మాళవిక నాయర్‌. ఆమె కూడా `ఎవడే సుబ్రమ్మణ్యం`లో హీరోయిన్‌గా చేసింది. `మహానటి`లో జెమినీ గణేషన్‌ మొదటి భార్య పాత్రలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు `కల్కి`లోనూ ఆమె కనిపిస్తుంది. రెండో ట్రైలర్‌లో మాళవిక నాయర్‌ పాత్రని రివీల్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో అటు విజయ్‌, ఇటు మాళవికలను ఆయన తన ప్రతి సినిమాలో కొనసాగిస్తున్నాడు. మరి గత చిత్రాల మాదిరిగానే `కల్కి` సంచలన విజయం సాధిస్తుందా అనేది చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో