ఇక చిరంజీవి చిన్నప్పుడు చెప్పిన మాటలను బయటపెట్టింది శ్రీజ. డాడీ తనని ఎంత పాంపర్ చేసినా, చిన్నప్పుడు ఓ విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పేవాడట. అదే రెస్పెక్ట్. పెద్ద వాళ్లని గౌరవించాలని, వాళ్లతో మర్యాదగా మాట్లాడాలి అని, మరీ పెద్దవాళ్లు, ఉన్నత స్థానంలో ఉన్న వారి కాళ్లకి దెండం పెట్టాలని చెప్పేవారని, అంతేకాదు ఇప్పుడు ఈ తరాన్ని తాను చూసుకుంటున్నాను అని, నెక్ట్స్ జెనరేషన్‌ని మీరే ముందుకు తీసుకెళ్లాలి, బాధ్యతగా ఉండాలని ఎప్పుడూ చెబుతుండేవాడట. పద్ధతులు నేర్చుకోవాలని, సిస్టమాటిక్‌గా ఉండాలని, హార్డ్ వర్క్ తో ముందుకు వెళ్లాలని ఎప్పుడూ చెబుతూ మోటివేట్ చేస్తుండేవాడట.