Today Horoscope: ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం..!

First Published Jun 26, 2024, 5:31 AM IST

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రముఖులతో పరిచయాలు లాభాదాయకంగా ఉంటాయి. పిల్లల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. ఉద్యోగులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభాదాయకంగా ఉంటాయి. 
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-మీ ఆలోచనా విధానం మీ ఇంట్లో మీ విలువను పెంచుతుంది. మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాధాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. 
 

Latest Videos


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిది. డబ్బు విషయంలో బంధుమిత్రులతో గొడవలు వస్తాయి. మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఇంటి నిర్మాణ పనులు సక్రమంగా సాగవు. ఇష్టదైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారం నష్టాల్లో సాగుతుంది. నిరుద్యోగులు అలాగే ప్రయత్నిస్తూ ఉండాలి. 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు మీరు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. అవసరానికి ఇతరులు సహాయం చేస్తారు. భూ క్రయ, విక్రయాలు లాభాదాయకంగా ఉంటాయి. 
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-అన్నదమ్ముల మధ్య స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.వృత్తి, ఉద్యోగులు తమ పనులను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. ఇంట్లోకి బంధుమిత్రుల రాకతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. 
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-గత కొన్ని రోజులుగా వివాదాలు పరిష్కారం అవుతాయి.ఆర్థిక ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.పెద్దల సలహాలను ఆచరణలో పెడతారు.ఉత్సాహంగా గడుపుతారు.పనుల్లో పట్టుదల అవసరం.బంధువర్గంతో వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు.
 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగులకు ఈ రోజు అంతగా బాగుండదు. వ్యాపారాలు లాభసాటిగా ఉండవు. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. 
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అన్నదమ్ముల అండదండతో గొడవల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వ్యాపారం మంచి లాభాల్లో నడుస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఒకరి ప్రవర్తన భయపెడుతుంది. కుటుంబ విషయంలో ఒక్కరి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగులు తమ ఆలోచనలను కార్యరూపం దాల్చుతారు. 
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-వృత్తి, వ్యాపారాలు మీరు అనుకున్నట్టు ఉండవు. ఇది మిమ్మల్ని  ఒత్తిడికి గురిచేస్తుంది. మీ పనికి తగ్గ గుర్తింపు ఉండదు. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ముఖ్యమైన పేపర్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మీరు ఊహించని విధంగా డబ్బు పొందుతారు. విలువైన వస్తువులను కొంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం మీ మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆస్థికి సంబంధించిన గొడవలు ఒకరి సహాయంతో పరిష్కారమవుతాయి. 

click me!