చైతన్య ఆలోచన మొత్తం సాయిపల్లవి చుట్టూనే.. సమంత ముందు చైని ఇరికిస్తున్న ఫ్యాన్స్

First Published Jan 18, 2021, 3:44 PM IST

నాగచైతన్య ఇప్పుడు తన ఆలోచన మొత్తం సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుందట. ఆయన నిద్ర లేచినా, పడుకున్నా, ఎటు వెళ్లినా ఆమె గురించే ఆలోచిస్తున్నారట. ఈ విషయంలో చైతూపై ఓ కన్నేయాలనే ఆలోచనకు సమంత వచ్చిందట. మరి ఇంతకి ఏం జరిగింది. చైతూ తన ఆలోచనలు సమంతపై కాకుండా సాయి పల్లవిపైకి ఎందుకు వెళ్తున్నాయి. అసలు కథేంటో చూస్తే.. 

నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న `లవ్‌ స్టోరి` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఫ్రెష్‌ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందిందనే విషయాన్ని స్పష్టం చేసింది.
undefined
ఇందులో చైతూ, సాయిపల్లవి ప్రేమించుకుంటారు. తమ ప్రేమ కోసం సాయిపల్లవిని తీసుకుని పారిపోతుంటాడు చైతూ. ఈ టీజర్‌ ఆద్యంతం కట్టిపడేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.
undefined
ఇదిలా ఉంటే నాగచైతన్య.. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో కెమెరామెన్‌ పీసీ శ్రీరామ్‌ చైతూకి తెలియకుండా ఓ ఫోటోని పంచుకున్నారు. ఇందులో చైతూ ఏదో ఓ విషయంపై చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. ఈ ఫోటోని చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. షూటింగ్‌ విరామ సమయంలో ఈ అద్భుతమైన ఫోటోని పీసీ శ్రీరామ్‌గారు తీశారు. ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా` అని పేర్కొన్నారు.
undefined
దీనికి సమంత స్పందిస్తూ ఓ కామెంట్‌ పెట్టింది. ఏంటీ నా గురించే ఆలోచిస్తున్నావా? అని కామెంట్‌ చేసింది. దీనికి చైతూ నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేదు.
undefined
కానీ అభిమానులు స్పందించారు. చైతూ ఇప్పుడు ఆలోచించేది సమంత గురించి కాదు, సాయిపల్లవి గురించి అని పేర్కొన్నారు.
undefined
దీంతో ఇది పెద్ద దుమారం రేపుతుంది. సరదాగా అభిమాని చేసిన కామెంట్‌ పై కొందరు నెటిజన్లు పాజిటివ్‌గా, మరికొందరు నెగటివ్‌గా కామెంట్‌ చేస్తున్నారు.
undefined
చైతూకి సమంత గురించి ఆలోచించేంత టైమ్‌ లేదు.. ఆయన ద్యాస మొత్తం సాయిపల్లవి చుట్టూనే. ఆమెతోనూ ప్రేమలో మునిగితేలుతున్నాడంటూ `లవ్‌స్టోరి` సినిమా స్టోరీని కనెక్ట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
undefined
ఇక సమంత అభిమానులు స్పందిస్తూ, చైతూ ఎప్పుడూ జెస్సీ గురించే ఆలోచిస్తాడు. ఆయన ఎక్కడ ఉన్నా పరోక్షంగా సమంతనే గుర్తు చేసుకుంటాడు` అని అంటున్నారు.
undefined
ఇలా ఫన్సీ కామెంట్లతో చైతూని ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు. ఇదంతా ఫ్యాన్స్ కి మంచి ఎంటర్‌టైనింగ్‌నిస్తుండటం విశేషం.
undefined
సమంత ప్రస్తుతం `ఫ్యామిలీమ్యాన్‌2` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. ఆమె ఇందులో ఉగ్రవాదిగా సమంత కనిపించనున్నారట. ఫిబ్రవరి 12న ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. రేపు(మంగళవారం) ట్రైలర్‌ విడుదల కానుంది.
undefined
ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ కోసం సమంత వరుసగా అటు ముంబయి, ఇటు హైదరాబాద్‌, అటు చెన్నైకి చక్కర్లు కొడుతుంది. ఇది తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానుంది. దీంతోపాటు గుణశేఖర్‌ రూపొందించే `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా సమంత నటించనుంది.
undefined
click me!