Eesha Rebba: నిషా కళ్ల ఈషా పాప డార్క్ చాక్లెట్‌ అందం చూస్తే ఒమిక్రాన్‌ వైరస్‌ కూడా జెలసీ ఫీలవుతుందట..

First Published Dec 4, 2021, 7:47 PM IST

డస్కీ అందాల తెలుగు సోయగం ఈషా రెబ్బా మంచి టాలెంటెడ్‌ నటి. మంచి పాత్రలు పడాలే గానీ ఆమెలోని అసలైన యాక్టింగ్‌ స్కిల్స్ బయటపడతాయి. గ్లామర్‌ క్వీన్‌గా రాణిస్తున్న ఈషా రెబ్బా లేటెస్ట్ గా హాట్‌ సెన్సేషన్‌గా మారిపోయింది. 
 

హాట్‌ అందాల భామ ఈషా రెబ్బా(Eesha Rebba) ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. జస్ట్ ఒక్క ఫోటోతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, చాక్లెట్‌ కలర్‌ శారీలో హోయలు పోయింది. చీకట్లో ఈషా దిగిన ఈ ఫోటోని అభిమానులతో పంచుకుంది ఈషా. కుర్రాళ్లకి వీకెండ్‌ ట్రీట్‌నిచ్చింది. ఈషా పంచుకున్న ఈ ఫోటో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ఈషా సెక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. అదే సమయంలో హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. Eesha Rebba Hot Photos.

ఈషా రెబ్బా గ్లామర్‌ పిక్స్ పై కుర్రాళ్లు హాట్‌ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమె అందాలను సెక్సీగా పోల్చుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిషా కళ్ల ఈషా పాప అని, డార్క్ చాకోలెట్‌ బేబీ అని కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మరింత ముందుకెళ్లి హాట్‌ కామెంట్స్ చేస్తున్నారు. 
 

eesha rebba

ఈషా రెబ్బా హాట్‌ అందానికి కరోనా వైరస్‌ కూడా ఫిదా అయిపోతుందని, కొత్తగా వస్తోన్న ఒమిక్రాన్‌ వైరస్‌ కూడా జెలసీగా ఫీలవుతుందంటూ ఫన్నీ, రొమాంటిక్‌ కామెంట్లు చేస్తుండటం విశేషం. దీంతో ఈ కామెంట్లతోపాటు ఈషా రెబ్బా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. వైరల్‌ అవుతుంది.  ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. సెక్సీ లుక్‌లో మతిపోగొట్టే ఈ బ్యూటీ అడపాదడపా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తుంది. నటిగా తనని తాను నిరూపించుకుంటోంది. వైరల్‌గా మారుతుంది. 

eesha rebba

2012లో `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది ఈషా రెబ్బా. ఇందులో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత `అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. సహజీవనం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మోడ్రన్‌ గర్ల్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాతోనూ టాలీవుడ్‌ చూపుని తనవైపు తిప్పుకుంది. 
 

eesha rebba

`బందిపోటు` సినిమాతో మెప్పించిన ఈషా రెబ్బా `ఓయి` సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫర్వాలేదనిపించుకుంది. కానీ ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఈ క్రమంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `అమీతుమీ` చిత్రంతో మరో సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఈషాకి సక్సెస్‌ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. చిన్న చిన్న సినిమాలే తప్ప పెద్ద చిత్రాలు ఆమె తలుపు తట్టలేదు. దీంతో చిన్న బడ్జెట్‌ చిత్రాల్లు `దర్శకుడు`, `అ!`, `బ్రాండ్‌ బాబు` వంటి సినిమాలు చేసింది. `అ`లో మంచి పాత్రే దక్కింది. కానీ ఆ క్రెడిట్‌ మాత్రం దర్శకుడికే వెళ్లింది.

eesha rebba

ఎన్టీఆర్‌తో `అరవింద సమేత`, సుమంత్‌తో `సుబ్రహ్మణ్యపురం`, `రాగల 24గంటల్లో`, `పిట్టకథలు`, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రాల్లో నటించింది. అయితే ఈషాకి మెయిన్‌ లీడ్‌గా మాత్రం పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రాకపోవడం విచారకరం. చిన్న చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోవడంతో ఈషా గుర్తింపుకి నోచుకోలేక మిగిలిపోయిన హీరోయిన్‌గా మారిపోతుందని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ `ఒట్టు`, తమిళంలో `అయిరామ్‌ జెన్మంగల్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

also read: మెగా డాటర్‌ నిహారికపై భర్త కంప్లైంట్‌.. ఫోటో షేర్‌ చేసి అసలు సీక్రెట్‌ రివీల్‌.. నెట్టింట వైరల్‌

click me!