బాబోయ్‌ కుర్రాళ్ల మీటర్లు పగిలిపోయేలా ప్రభాస్‌ భామ హాట్‌ షో.. పోటెత్తిన ఎద అందాలకు ఇంటర్నెట్‌ షేకింగ్‌

First Published May 29, 2023, 6:37 PM IST

పూరీ జగన్నాథ్‌ హీరోయిన్‌.. దిశా పటానీ బాలీవుడ్‌ని ఊపేస్తుంది. ఆమె సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలో, ఈవెంట్లలో ఉర్రూతలూగిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. 

దిశా పటానీ తాజాగా తన బోల్డ్ ఫోటోలను, అత్యంత హాట్‌ ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇందులో ఆమె బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది. ఉప్పొంగుతున్న ఎద అందాలను, థండర్‌ థైస్‌ని చూపిస్తూ ఆమె ఈ ఫోటో షూట్‌ చేయడం విశేషం. ఇలా విజువల్‌ ట్రీట్‌ ఇస్తూ ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

దిశా పటానీ నయా హాట్‌ అండ్‌ సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆమె కిల్లర్‌ లుక్‌ మైండ్‌ బ్లాక్‌ చేసేలా ఉంది. అయితే దిశా పటానీ అందాల ఆరబోత కొత్త కాదు. ఆమె ఛాన్స్ దొరికితే ఒంటిపై డ్రెస్‌ నిలవనంటోంది అన్నట్టుగా హాట్‌ షో చేస్తుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. 
 

Latest Videos


అయితే ఇప్పటికే సమ్మర్‌ వేడితో కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దిశా పటానీ ఇలా అందాల డోస్‌ పెంచి మరీ గ్లామర్‌ షో చేయడంతో మరింతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి తట్టుకోలేక బేజారెత్తిపోతున్నారు. గోల పెడుతున్నారు. కామెంట్ల రూపంలో తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. బట్‌ ఈ బ్యూటీ అందాలను ఎంజాయ్ చేస్తుండటం విశేషం. 
 

దిశా పటానీ `లోఫర్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించి ఆకట్టుకుంది. పూరీ తనదైన స్టయిల్‌లో ఈ బ్యూటీని `లోఫర్‌`లో చూపించారు. కానీ ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌కి చెక్కేసిందీ హట్‌ భామ. మళ్లీ టాలీవుడ్‌ వైపు చూడలేదు. 

అక్కడ వరుసగా సుశాంత్‌ సింగ్‌, రాజ్‌పుత్‌, టైగర్‌ ష్రాఫ్‌, సల్మాన్‌ ఖాన్‌, జాన్‌ అబ్రహం వంటి స్టార్లతో కలిసి నటించింది. అయితే ఈ బ్యూటీకి `బాఘి2`, `ఎంఎస్‌ ధోని` తప్ప మిగిలినవి పెద్దగా హిట్‌ కాలేదు. దీంతో స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరలేకపోయింది. ఇప్పటికీ గ్లామర్‌ డాల్‌గానే మెరుస్తుంది. ఈవెంట్లలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. 
 

ఇక ప్రస్తుతం భారీ చిత్రాల్లో భాగమవుతుంది. చాలా గ్యాప్‌ తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే`లో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. దీంతోపాటు తమిళంలో సూర్యతో `కంగువా`, హిందీలో `యోధ` చిత్రాలు చేస్తుంది. ఈ సినిమాలపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఇవి హిట్‌ అయితే దిశా పటానీ రేంజ్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. మరి ఆమెకి హిట్‌నిస్తాయా అనేది చూడాలి. 
 

click me!