బాలకృష్ణ ఓ పెద్ద హీరోకి మంచి సలహా ఇచ్చాడట. ఆ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవిని పెట్టుకోవద్దు, సినిమా ఆడదని కూడా చెప్పాడట. కానీ వినకుండా చేస్తే ఏం జరిగిందంటే?
బాలకృష్ణ.. ఒక్కసారి కథ విన్నాడంటే, ఆయనకు నచ్చిందంటే మరో ఆలోచన లేకుండా సినిమా చేస్తారు. డైరెక్షన్‌లోనూ ఇన్‌వాల్వ్ కారు. దర్శకుడికి పూర్తి ఫ్రీడమ్ ఇస్తారు. అందుకే ఆయనతో వర్క్ చాలా కంఫర్ట్ అని చాలా మంది దర్శకులు చెబుతుంటారు. అయితే తనకు ఐడియాలు వస్తే చెబుతాడట. చాలా మంది దర్శకులు తీసుకుంటారని, దానికి తగ్గట్టుగా చేస్తారని, తన సలహాలు చాలా వరకు వర్కౌట్ అయినట్టు బాలయ్య తెలిపారు. ఇలా ఓ స్టార్ హీరోకి కూడా సలహా ఇచ్చాడట. కానీ వినలేదట. ఫలితం ఏం జరిగిందో తెలిపారు బాలయ్య. ఆ కథేంటో చూస్తే..
undefined
బాలకృష్ణ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` చిత్రాలతో విజయాలు అందుకుని దూసుకుపోతున్నారు బాలయ్య. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎన్బీకే109` సినిమాలో నటిస్తున్నారు. ఇది బాలయ్య మార్క్ ఊరమాస్ మూవీలా ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. అప్పట్లో విడుదలైన గ్లింప్స్, టీజర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.
బాలయ్య ఇటీవల ఓ యూట్యూబ్‌కి(న్యూస్ 18)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు బాలయ్య. అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి ఒక్కసినిమా కూడా చేయకపోవడానికి కారణాలు తెలిపారు. శ్రీదేవి అంటే తన దృష్టిలో పెద్ద నటి, గొప్ప నటి. పెద్ద అందాల తార. అలాంటి హీరోయిన్ సినిమా చేస్తుందంటే ఆమె రేంజ్‌లో సినిమా ఉండాలి. లేదంటే తేలిపోతుంది. ఆమె స్థాయి పాత్రలో తన సినిమాల్లో దక్కలేదని, దీంతో కలిసి నటించే అవకాశం రాలేదని తెలిపారు. అంతేకాదు తమ కాంబినేషన్ సెట్ కాదనిపించిందని, అందుకే నటించలేదని తెలిపారు. శ్రీదేవి చేస్తే ఆమె స్థాయిలో ఆ పాత్ర ఉండాలని తాను భావిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు బాలయ్య. ఓ స్టార్ హీరో సినిమా నుంచి శ్రీదేవిని తొలగించాలని తెలిపారట.
తాను ఇతర హీరోలకు కూడా సలహాలు ఇస్తానని తెలిపారు బాలయ్య. అలా ఓ పెద్ద హీరో సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవిని తీసుకున్నారు. ఆ విషయం తెలిసి హీరో, దర్శకుడికి చెప్పాడట. కానీ తన మాట ఎవరూ పట్టించుకోలేదట. తాను చెప్పడమేంటని కావాలని శ్రీదేవిని హీరోయిన్‌గా పెట్టుకున్నారు. ఆ తర్వాత సినిమా విడుదలై కనీసం పది రోజులు కూడా ఆడలేదట. అంతేకాదు అందులో మరో లేడీ ఆర్టిస్ట్ ని కూడా తీసేయాలని తెలిపాడట. అది కూడా వినలేదని, ఆ సినిమా ఆడదని కూడా ముందే చెప్పాడట. డబ్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అని, రీమేక్ వర్కౌట్ కాదన్నారట. కానీ వినకుండా చేశారని, ఆ సినిమా ఆడలేదని, తాను చెప్పిందే జరిగిందని ఆ తర్వాత నాలుక కర్చుకున్నారని తెలిపారు బాలయ్య. మరి ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఏంటి? అనేది సస్పెన్స్.
శ్రీదేవి.. బాలయ్య సమకాలీనుల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది. చిరుతో ఐదారు సినిమాలు చేసినా బాలయ్య బాగా యాక్టివ్‌గా ఉన్న సమయంలో చేసింది `జగదేక వీరుడు అతిలోక సుందరి`. ఆ తర్వాత `ఎస్పీ పరుశురామ్` చిత్రాలు చేశారు. ఇందులో `ఎస్పీ పరశురామ్` రీమేక్ మూవీ. ఇందులో చిరుకి జోడీగా శ్రీదేవి నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. బహుశా ఈ సినిమా విషయంలోనే బాలయ్య ఈ కామెంట్స్ చేసి ఉంటాడని తెలుస్తుంది. ఎందుకంటే నాగార్జునతో శ్రీదేవి నటించిన సినిమాలు రీమేక్ కాదు, అలాగే వెంకీతో చేసిన ఒకే ఒక్క మూవీ `క్షణక్షణం` పెద్ద హిట్ అయ్యింది. ఈ కంపేరిజన్‌లో చిరంజీవితో సినిమా విషయంలోనే బాలయ్య ఈ సలహా ఇచ్చి ఉంటాడని అర్థమవుతుంది. తన ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.