నాగార్జున అన్న కొడుకు హీరో ఎందుకు కాలేదు? వస్తే చైతు, అఖిల్ ని తొక్కేసేవాడా?

By Sambi ReddyFirst Published Sep 29, 2024, 8:13 AM IST
Highlights

అక్కినేని నాగార్జున అన్న కొడుకు ఆదిత్య హీరో ఎందుకు కాలేదనే వాదన ఉంది. అతని పేరు ఆదిత్య కాగా, నాగార్జున ఎంకరేజ్ చేయలేదా? కారణాలు ఏమిటో చూద్దాం.. 
 

గ్లామర్ ఫీల్డ్ లోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ముఖ్యంగా హీరోగా సక్సెస్ అయితే వచ్చే గౌరవం, డబ్బు, హోదా వేరు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఖచ్చితంగా హీరో కావాలని అనుకుంటారు. టాలీవుడ్ ని శాసిస్తుంది స్టార్ హీరోలు, నిర్మాతల వారసులే. 
ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్... నెపో కిడ్స్ అని చెప్పొచ్చు. అయితే తమ టాలెంట్ తో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. 

అక్కినేని నాగేశ్వరరావు వారసులు

సుదీర్ఘకాలం తెలుగు సినిమాను శాసించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీఆర్-ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అంటారు. ఇక ఏఎన్నార్ కుమారులు వెంకట్, నాగార్జున పరిశ్రమలో రాణించారు. పెద్దబ్బాయి వెంకట్ ని నిర్మాతను చేశాడు. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వెంకట్ అనేక చిత్రాలు నిర్మించాడు. 

Latest Videos

నాగార్జున హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నాగార్జున నిలదొక్కుకున్నాడు. మజ్ను, గీతాంజలి, జానకి రాముడు, శివ నాగార్జునకు స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. విభిన్నమైన సబ్జక్ట్స్ తో నాగార్జున అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. 

ఏఎన్నార్ మూడోతరం వారసులుగా సుమంత్, సుశాంత్ పరిశ్రమలో అడుగుపెట్టారు. వీరు నాగార్జున కూతుళ్ల కుమారులు. వీరిద్దరూ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక నాగార్జున ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలు అయ్యారు. నాగ చైతన్య టైర్ టు హీరోల జాబితాలో చోటు సంపాదించారు. తనకంటూ మార్కెట్, ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన స్ట్రగుల్ అవుతున్నారు. 

ఇండస్ట్రీకి దూరంగా నాగార్జున అన్నయ్య కొడుకు

అక్కినేని వెంకట్ సైతం పరిశ్రమలోనే ఉన్నారు. ఏఎన్నార్ తో పాటు నాగార్జునతో ఆయన చిత్రాలు నిర్మించారు. దశాబ్దాల అనుభవం వెంకట్ కి ఉంది. ఆయన కుమారుడి పేరు అక్కినేని ఆదిత్య. మరి అక్కినేని వెంకట్ పరిశ్రమకు ఎందుకు దూరమయ్యాడు? ఆయన హీరో ఎందుకు కాలేదనే వాదన ఉంది. 

ఆదిత్య చూడటానికి బాగుంటాడు. పక్కా హీరో మెటీరియల్. ఆదిత్య గురించి జనాలకు తెలిసింది తక్కువే. దానికి కారణం.. ఆదిత్య సినిమా కార్యక్రమాలు, వేడుకలకు దూరంగా ఉంటారు. వెంకట్ కొడుకును హీరో చేయాలి అనుకోలేదా? లేదంటే నాగార్జున ప్రోత్సహించ లేదా? అనే సందేహాలు ఉన్నాయి.  

నాగార్జున-వెంకట్ మధ్య విబేధాలు 

ఏఎన్నార్ కుమారులు నాగార్జున-వెంకట్ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన ఉంది. ఆస్తుల పంపకాల విషయంలో గొడవలుపడ్డారట. దాంతో వెంకట్ తో నాగార్జునకు దూరం పెరిగిందట. ఆదిత్య పరిశ్రమకు రాకపోవడానికి, అతన్ని నాగార్జున ఎంకరేజ్ చేయకపోవడానికి కారణమదే, అనే ఓ వాదన ఉంది. 

నాగార్జునతో విబేధాల వార్తలపై అక్కినేని వెంకట్ ఓ సందర్భంలో స్పందించారు. ఆస్తుల పంపకాల కారణంగా నాగార్జునతో నాకు విబేధాలు తలెత్తాయనే వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే మేము డబ్బు మనుషులం కాదు. ఆస్తుల కోసం వెంపర్లాడము. ఈ మధ్యనే నాగ చైతన్య ఇంట్లో కలిశాము అన్నారు. 

ఆదిత్య నాట్ ఇంట్రెస్టెడ్ 

ఇక ఆదిత్య హీరో కాకపోవడం పైన కూడా అక్కినేని వెంకట్ వివరణ ఇచ్చారు. ఆదిత్యకు నటుడు కావాలని అసలు లేదు. నేను రెండు మూడు సార్లు అడిగి చూశాను. నాకు హీరో కావాలని లేదని అన్నాడు. నటించడం తన వల్ల కాదని, ఆ టాలెంట్ తనకు లేదని ఆదిత్య భావించాడు. తాను చిత్ర పరిశ్రమకు రానని గట్టిగా చెప్పాడని, వెంకట్ స్పష్టత ఇచ్చారు. 

ఆదిత్య పరిశ్రమకు రావడం నాగార్జునకు ఇష్టం లేదు. ఆయన అఖిల్, నాగ చైతన్యలకు పోటీ ఇస్తాడని నాగార్జున ఆందోళన చెందాడని వచ్చిన పుకార్లలో నిజం లేదని తేలిపోయింది. కాగా ఆదిత్య స్పోర్ట్స్ మెన్. అతడు రొటాక్స్ మాక్స్ కార్టింగ్ లో ఇండియన్ ఛాంపియన్. ఇది ఓ కార్ రేసు. చాలా కాస్లీ క్రీడ. ఇండియాలో స్పాన్సర్స్ దొరకకపోవడం వలన ఆదిత్య ముందుకు వెళ్లలేకపోయాడట. ఆదిత్యకు వివాహమైంది. ఇక ఆయన చిత్రాల్లోకి వచ్చే అవకాశం లేదు. 

నాగ చైతన్య మాత్రమే సక్సెస్ 

ఏఎన్నార్ వారసుల్లో నాగార్జున స్టార్ గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున స్టార్ హీరోలుగా దశాబ్దాల పాటు తెలుగు సినిమాను శాసించారు. ప్రస్తుతం నాగార్జున మార్కెట్, స్టార్డం తగ్గింది. సోలోగా ఆయన సినిమాలు సక్సెస్ కావడం లేదు. దాంతో నాగార్జున మల్టీస్టారర్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నాగార్జునకు హిట్స్ ఇచ్చిన బంగార్రాజు, నా సామిరంగా మల్టీస్టారర్స్ అని చెప్పొచ్చు. 

అక్కినేని మూడో తరం వారసుల్లో నాగ చైతన్య మాత్రమే సక్సెస్ అయ్యాడు. సుమంత్, సుశాంత్ ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలో సుమంత్ ఒకటి రెండు హిట్స్ అందుకున్నారు. అనంతరం వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డాడు. ఇక సుశాంత్, సపోర్టింగ్, విలన్ రోల్స్ చేస్తున్నాడు. మాస్ హీరో ఇమేజ్ పై కన్నేసిన అఖిల్ కి బ్రేక్ రాలేదు. 

నాగ చైతన్య మాత్రం ఒకింత సక్సెస్ అయ్యాడు. ఆయన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంచుకున్న ప్రతిసారి నాగ చైతన్యకు కూడా ప్లాప్స్ పడ్డాయి. అందుకే తనకు సెట్ అయ్యే కథలతో చిత్రాలు చేస్తున్నారు. 

click me!