చిరంజీవి సినిమాకి అనుకోని కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `విశ్వంభర` సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటుందట. దానికి కారణాలేంటనేది చూస్తే
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రారంభ సమయంలోనే ప్రకటించింది టీమ్. కానీ తాజాగా వెనక్కి తగ్గబోతున్నారట. సంక్రాంతి బరి నుంచి `విశ్వంభర` తప్పుకోబోతుందని సమాచారం. పలు అనుకోని కారణాలు ఈ మూవీని వెంటాడుతున్న నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. మరి ఆ కారణాలేంటి? అసలేమైంది? అనేది చూస్తే,
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. `భోళా శంకర్` వంటి ఫెయిల్యూర్ తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు చిరు. ఎందుకంటే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది `జగదేక వీరుడు అతిలోక సుందరి`. ఈ మూవీ సోషియో ఫాంటసీగాతెరకెక్కింది. ప్రస్తుత కాలానికి ఫాంటసీ ఎలిమెంట్లు జోడించి దర్శకుడు కే రాఘవేంద్రరావు చేసిన మ్యాజిక్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం టాలీవుడ్‌లోనే టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో చిరంజీవి, శ్రీదేవి చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు.
చాలా ఏళ్ల తర్వాత `విశ్వంభర`తో అలాంటి జోనర్‌ని టచ్ చేస్తున్నాడు చిరంజీవి. చాలా సెంటిమెంట్‌గానూ భావిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్, మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో అలాంటి మూవీ అయితే బాగుంటుందని భావించి ఈ సినిమా చేస్తున్నారు చిరంజీవి. `బింబిసార`తో తానేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు వశిష్ట. దీనికి సీక్వెల్‌ని కూడా చేయాల్సింది. కానీ అనూహ్యంగా దాన్నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవితో `విశ్వంభర`ని పట్టాలెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
`విశ్వంభర` చిత్రంలో కాస్టింగ్ కూడా భారీగానే ఉంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. `స్టాలిన్` తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా నిలిచింది. వీరితోపాటు మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి వారు కీలక పాత్రల్లో నటించబోతున్నారట. నవీన్ చంద్ర కూడా మరో ముఖ్య పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అలాగే బాలీవుడ్ నటుడు కూనల్ కపూర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇలా కాస్టింగ్ పరంగా భారీగానే ఉండబోతుంది. ఈ భారీ కాస్టింగ్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ మధ్యనే మ్యూజిక్ వర్క్ జరుగుతుందని టీమ్ అధికారికంగా వెల్లడించింది. ముంబయిలో కీరవాణి వర్క్ చేస్తున్నారట. ఆర్‌ఆర్, ట్యూన్స్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు సమాచారం. వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా ఉండబోతుంది ఈ మూవీకి. ఓ వైపు ఆ వర్క్ కూడా జరుగుతుందట. ఇవన్నీ శరవేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు టీమ్. సినిమా ప్రారంభంలోనే 2025 సంక్రాంతి అని టీమ్ వెల్లడించింది. ఆ టార్గెట్‌తోనే టీమ్ వర్క్ చేస్తుంది. కానీ లేటెస్ట్ గా అనుకోని ఆపదలు వచ్చాయి. దీంతో సినిమా షూటింగ్ డిలే అవుతుంది. సినిమా సంక్రాంతికి రావడం కూడా కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ కారణాలేంటో చూస్తే..
చిరంజీవి అనారోగ్యానికి గురి కావడమే. ఆయనకు ఇటీవల చికెన్ గున్యా వచ్చింది. దీంతో నెల రోజులకుపైగానే ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. దీని కారణంగా చిరంజీవి చాలా సిక్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన షూటింగ్‌కి దూరమయ్యాడు. ఇది సినిమా షూటింగ్‌పై ప్రభావం పడుతుంది. చిరంజీవి ఇప్పట్లో షూటింగ్‌కి వెళ్లే పరిస్థితి లేదని టాక్. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొంత టైమ్ పట్టే ఛాన్స్ ఉంది. చిరు ఏడు పదులకు దగ్గర్లో ఉన్న నేపథ్యంలో కోలుకోవడానికి కూడా కొంత టైమ్ పడుతుంది. ఇది కూడా సినిమా షూటింగ్ డిలే కావడానికి కారణమవుతుందని, దీని ప్రభావం సినిమా మొత్తంపై ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా జరుగుతుంది. కానీ అనుకున్న టైమ్‌కి అది పూర్తి కావడం కూడా కష్టమనే అంటున్నారు. ఈ కారణాలతో `విశ్వంభర` సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీకి ఇంకా ఓటీటీ కూడా కాలేదు. ఓటీటీ సంస్థలు తక్కువ మొత్తానికి అడుగుతున్నాయని, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న మూవీకి చాలా తక్కువ అమౌంట్ కోట్ చేయడంతో టీమ్ మల్లగుల్లాలు పడుతుందని టాక్. ఇది కూడా సినిమా డిలే అవడానికి ఓ కారణమని తెలుస్తుంది.
వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆల్మోస్ట్ చిరంజీవి `విశ్వంభర` ఈ పోటీ నుంచి తప్పుకున్నట్టే అని తెలుస్తుంది. దీంతో బాలయ్య సినిమాకి కూడా మార్గం సుగుమం అవుతుంది. ఆయన బాబీ దర్శకత్వంలో నటిస్తున్న `ఎన్బీకే109` సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అలాగే నితిన్ హీరోగా రూపొందుతున్న `తమ్ముడు` చిత్రాన్ని కూడా సంక్రాంతికే తీసుకురాబోతున్నారు. రవితేజ కొత్త సినిమా సంక్రాంతినే టార్గెట్ చేశారట. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ కూడా సంక్రాంతికే రాబోతున్నట్టు వెల్లడించారు. వీటితోపాటు నాగవంశీ `మ్యాడ్ 2`, సందీప్ కిషన్ నటిస్తున్న `మజాకా` మూవీ కూడా పొంగల్‌కే రాబోతుందని సమాచారం. అంతేకాదు రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` కూడా సంక్రాంతికి పోస్ట్ పోన్ కాబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ చిరంజీవి తప్పుకోవడంతో వీరంతా పోటీలోకి వస్తున్నట్టు టాక్.