vuukle one pixel image

పృథ్వీ- విష్ణు ప్రియ లవ్‌ ట్రాక్‌ మార్కులు కొట్టేసిన నబీల్‌

konka varaprasad  | Published: Sep 28, 2024, 8:38 AM IST

బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 8 రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇంతవరకూ హౌస్‌లో ప్రేమ జంట లేదేంటబ్బా అనుకుంటున్న టైంలో పృథ్వీ- విష్ణుప్రియ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సోనియా పుల్లలు పెట్టడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక హౌస్‌లో ఫన్ డే జరిగింది. సరదాగా అందరూ గొడవలు మర్చిపోయి.. ఒకరి క్యారెక్టర్‌ మరొకరు చేసి నవ్వించారు. ఇక అందరికంటే నబీల్ ఎక్కువ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆదిత్య ఓం పాత్రలో అదరగొట్టాడు. బిగ్ బాస్ టీమ్ అంతా ఏకగ్రీవంగా నబిల్‌కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేశారు.