కార్తికేయ 2 చిత్రం ఇండియా మొత్తం ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకు చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని దిల్ రాజు తెలిపారు. జూన్, జూలై నెలల్లో సినిమాల పరిస్థితి గమనిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ ఎటు పోతోంది అనిపించింది. కానీ ఆగష్టు నెల చిత్ర పరిశ్రమకి ఒక ఊపిరి తీసుకువచ్చింది. వరుసగా బింబిసార, సీతారామం, కార్తికేయ 2 విజయం సాధించాయి.