Guppedantha Manasu: రిషి వసుధారలను విడగొట్టడానికి దేవయాని కొత్త ప్లాన్.. ఏం జరగనుంది?

First Published Oct 19, 2022, 9:06 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ ని, భోజనం నిజంగా హోటల్ నుంచి తెచ్చిందేనా అని అడగగా, వీడేంటి ఇలాగ అడుగుతున్నాడు అని గౌతమ్ మనసులో అనుకోని హోటల్ నుంచి తెచ్చిందే రా బాబు తిను అని అంటాడు. ఇంకో ముద్ద తిన్న రిషి బయట ఎక్కువ సేపు నుంచి ఉంటే కాళ్ళు నొప్పి పెడతాయి లోపలికి రా అని అంటాడు. నేను కూర్చునే ఉన్నాను కదరా అని గౌతమ్ అడగగా, నిన్ను కాదు గౌతమ్. వసుధార లోపలికి రా అని అనగా వసు లోపలికి వస్తుంది. అప్పుడు గౌతమ్, వసుధారే ఈ విషయం నీకు చెప్పొద్దు అన్నాది అని అంటాడు. అప్పుడు రిషి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని వసుని అడగగా, అంటే కోపంతో భోజనం మానేయకూడదు కదా సార్ అందుకే భోజనం తెచ్చాను అయినా ఎలా కనిపెట్టారు అని అడుగుతుంది. నీ చేతి వంట కదా అని రిషి అంటాడు. 

అప్పుడు గౌతమ్ నేనిక్కడ నుంచి వెళ్తాను అని అనగా ఉండమని రిషి చెప్పి, పసుధారతో, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. వెళ్ళమంటారా సార్ అని వసు అనగా, గౌతమ్ దింపేస్తాడు వెళ్ళిపో అని అంటాడు రిషి. ఉండమని చెప్పొచ్చు కదా సార్ అని వసు మనసులో అనుకుంటుంది. రిషి కొంచెం ఆలోచించి ఏదైనా తిన్నావా అని అడగగా లేదు సార్ అని వసు అంటుంది. అయితే కూర్చో భోజనం చేశాక వెళ్ళు అని రిషి అంటాడు. ఇలా అనుకున్నానో లేదో అలా ఉండమన్నారు సార్ అని వసు మనసులో అనుకుంటుంది. తర్వాత వసు ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి రిషి సార్ ఇలాగే మీరు ఆఫీసులో ఉంటే ఇంట్లో మేడం, సార్లు బాధపడతారు కదా మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేలా చేస్తాను అనుకోని తలుపు తీసేలోగా అక్కడ దేవయాని ఉంటుంది. దేవయాని ని చూసి ఆశ్చర్య పోతుంది ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం అని అడగగా ఊరికినే వచ్చాను వసుధార.

అయినా నేను ఇక్కడికి రాకూడదా వచ్చినందుకు మర్యాదలను చేయక్కర్లేదు నువ్వు అన్ని సర్దుకొని ఇంటికి పదా ఎలాగా కాబోయే కోడలివి కదా అని అనగా వసుధార ఆశ్చర్యపోయి, ఈవిడ ఏదో కొత్త ప్లాన్ తో వచ్చారు ఏం మాట్లాడినా తిరిగి బెడిసి కొడుతుంది ఏం మాట్లాడకుండా ఉండాలి అని అనుకుంటుంది. అప్పుడు దేవయాని, అయినా మనకెందుకు వసుధార ఈ గురుదక్షిణ ఒప్పందాలు లాంటివి హాయిగా నువ్వు, రిషి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోకుండా ఎందుకంటావ్ పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ నీ సంతోషాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. నేను బయట వెయిట్ చేస్తాను అన్ని సదుకుని వచ్చేయని అంటుంది.  ఆ తర్వాత సీన్లో రిషి గౌతమ్ లు బ్యాడ్మింటన్ ఆడుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రిషి కి వసు ఫోన్ చేసి సార్ దేవయాని మేడం ఇక్కడికి వచ్చారు త్వరగా రండి అని అనగా రిషి అప్పటికప్పుడే బయలుదేరి దారిలో వెళ్తూ, పెద్దమ్మ ఎందుకు అక్కడికి వెళ్ళింది అని అనుకోని దేవయానికి ఫోన్ చేస్తాడు. 

అప్పుడు దేవయాని, నాకు తెలుసు రిషి, వసుధార నీకు ఫోన్ చేసి చెప్తుందని నాకు అదే కావాలి అప్పుడే కదా నా ప్లాన్ అమలు పడుతుంది ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడాలంటే ఇప్పుడు నీ ఫోన్ ఎత్తకూడదు అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంట్లో ఉన్న వసు కంగారుపడుతూ జగతి మేడంకి విషయం చెబుదామా వద్దు మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు రిషి సార్ ఉన్నారు కదా చూసుకుంటారు అని అనుకుంటుంది. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు ఏమైంది పెద్దమ్మ ఇక్కడికి వచ్చారు అని అనగా వాసుదార కూడా బయటకు వస్తుంది. అప్పుడు దేవయాని నీకోసమే ఎదురు చూస్తున్నాను రిషి వసుదారని ఇంటి కోడలుగా బట్టలన్నీ సర్దుకొని ఇంటికి రమ్మన్నాను కానీ తను రావడం లేదు. నా పెద్దరికం పక్కనపెట్టి గురుదక్షిణ ఒప్పందం వదులు కోమని తన నిర్ణయం మార్పిద్దామని వచ్చాను అని అనగా రిషి, అలా చేయకూడదు పెద్దమ్మ ఎవరు నిర్ణయాలు వాళ్ళకి ఉంటాయి.
 

వాళ్ళంతట వాళ్లే మార్చుకోవాలి మన బలవంతం మీద వాళ్ళు మార్చుకుంటే తర్వాత ఎప్పటికైనా అది సమస్య అవుతుంది అని అనగా వసుధార, అవును మేడం మన నిర్ణయాలు ఇంకొకరి మీద రుద్దకూడదు మారాలనుకుంటే వాళ్లే మారుతారు దాని కోసం మీరంతా కంగారు పడాలిసిన అవసరం లేదు. మీరు నా కోసం, రిషి సార్ కోసం ఇంత ఆలోచిస్తున్నారు అదే చాలు నేను ఎప్పటికైనా మీ ఇంటికి రావాల్సిన దాన్ని కదా నాకు రిషి సార్ కి మధ్య ఈ చిన్న ఒప్పందం తప్ప ఇంకేం అపార్ధాలు లేవు మేము బానే ఉన్నాము అని వసు అంటుంది.అప్పుడు దేవయాని ఏదో మాట్లాడుబోతుండగా రిషి దేవయానితో, పెద్దమ్మ ఇప్పుడు ఈ మాటలన్నీ ఊరు బయట ఎందుకు మాట్లాడడం అని అంటాడు. ఇంతలో పక్కింటి ఆవిడ వచ్చి ఏం వసుధార బయట మాట్లాడుతున్నారు ఏవైనా గొడవా అని అడగగా, ఏమీ లేదు మా ఇంటి వ్యవహారమే అని వసుధార అంటుంది. 

మరి బయట ఎందుకు మాట్లాడుకోవడం ఇంట్లోకి వెళ్లి మాట్లాడొచ్చు కదా అని ఆ పక్క ఆవిడ అనగా భలే చెప్పారు అని వసుధార అంటుంది. అప్పుడు వసుధార నెమ్మదిగా దేవయాని చెవి దగ్గరికి వెళ్లి, మీరేం భయపడొద్దు మేడం నేను ఆ ఇంటికి వస్తాను. అందరి తిక్క కుదురుస్తాను అని అనగా, నేను ఇంటికి రమ్మని చెప్తున్నాను కదా ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావా అని అంటుంది. దానికి వసుధార, మీరే అన్నారు కదా మేడం నేను తెలివైన దాన్ని అని అనగా ఇంతలో రిషి, ఇప్పుడు రోడ్డు మీద మీరేం మాట్లాడుకోవద్దు ఇంటికి వెళ్దాము పదండి పెద్దమ్మ అని దేవయాని ని అక్కడ నుంచి తీసుకెళ్లి పోతాడు. కారులో రిషి, దేవయాని వెళ్తున్నప్పుడు, దేవయాని ఏడుస్తుంది. దానికి రిషి ఎందుకు ఏడుస్తున్నాడు అని అనగా నేను నా పెద్దరికం ని పక్కన పెట్టి వసుధారని ఒప్పందం మానుకోమని అడిగాను. ఎలాగో  మీ అమ్మానాన్నలకి నీ మీద బాధ్యత లేదు.

 నేనే ఆ బాధ్యత తీసుకొని మాట్లాడుదాం అనుకుంటే వసుధార నా పెద్దరికం కూడా పట్టించుకోలేదు అని అంటుంది.దానికి రిషి వాసుధార నీ ఎలా మార్చాలో నాకు తెలుసు పెద్దమ్మ మీరు మా గురించి ఏం కంగారు పడొద్దు వసుధరకి జగతి మేడం మీద ఉన్న కృతజ్ఞతా భావం కన్నా నా మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!