అప్పుడు జగతి మహేంద్ర, ఫణీంద్ర, ధరణి ల నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు అందరూ ఇష్టమే అని చెప్పడంతో జగతి, మహేంద్ర నవ్వుకుంటూ దేవయాని తిక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు రిషికి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడు రిషి వసుధార నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. ఏ అర్హతతో ఇంటికి రావాలి సార్ అని అడిగావు ఇప్పుడు చెబుతున్నాను విను ఈ రిషేంద్ర భూషణ్ భార్యగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టు అనడంతో దేవయాని షాక్ అవుతుంది.