Guppedantha Manasu: జగతి, మహేంద్రలపై సీరియస్ అయిన దేవయాని.. వసుధార కోసం మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన రిషి?

First Published Jan 10, 2023, 10:21 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని ఇంటికి రావడంతో జగతి దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జగతి అక్కయ్య రిషి ఫోన్ చేశాడా అని అనగా దేవయాని ఏమీ తెలియని అంటగా అదేంటి మీతో రాలేదా అని అనగా జగతి లేదు అనడంతో దేవయాని ఆశ్చర్యపోయినట్లు నటిస్తుంది. అదేంటి అని దేవయాని అనడంతో రిషి కార్లో బయలుదేరాడు ఇక్కడికి వచ్చాడని అనుకున్నాము అంటాడు మహేంద్ర. అది సరే మీరు ఎక్కడికి వెళ్లారు వదినగారు అని అనగా చిన్న పని ఉంది బయటికి వెళ్లాను టెన్షన్ తో మాట్లాడుతుంది దేవయాని. అప్పుడు మహేంద్ర అలాగే కోపంగా చూడటంతో దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఫణింద్ర వస్తాడు.
 

 ఏంటి మహేంద్ర ఎప్పుడొచ్చారు అనడంతో ఇప్పుడే వచ్చాము అన్నయ్య రిషి ఇంటికి వచ్చాడని అనుకున్నాము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటాడు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అసలు ఏం జరిగింది అని అడగడంతో అప్పుడు మహేంద్ర జరిగిన మొత్తం వివరించగా ఫణీంద్ర, ధరణి షాక్ అవుతారు. ఇప్పుడు ఏం చేద్దాం మహేంద్ర అనడంతో  చేసేది ఏం లేదండి అది వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పుడు రిషి ఎక్కడికి వెళ్ళాడు అని దేవయాని దొంగ ప్రేమలు చూపిస్తూ నాటకాలు ఆడుతూ ఉంటుంది. రెండు కార్లు ఉన్నప్పుడు అక్కడే ఒక కారు వదిలేసి మీరు ముగ్గురు కలిసి రావచ్చు కదా.

 ఇద్దరు రాకపోతే అనడంతో వదిన అక్కడ ఉన్న పరిస్థితులలో రిషి మా మాట వినలేదు అని మహేంద్ర అనడంతో నాకేం చెప్పొద్దు మహేంద్ర అని దొంగ ప్రేమను చూపిస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడు మీరు చేయాల్సినంత చేసి రిషి మీద నెట్టేస్తున్నారు అసలే రిషి సెన్సిటివ్ ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి ఉంటుంది దేవయాని. ఏం భయపడకండి రిషి ఎక్కడ ఉన్న ఇంటికి వస్తాడు అని ధైర్యం చెబుతాడు ఫణింద్ర. మరొకవైపు వసుధార కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు రిషి. అప్పుడు పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడి అసలు ఏం జరుగుతుందో ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కాలేదు అంటూ వసు అన్న విషయాలు జరిగిన విషయాలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు.
 

నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేనిది నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రాజీవ్ పోలీస్ స్టేషన్ బయట ఉండడం గమనించి వసుధార దగ్గరికి వెళ్తాడు. వసు మీ రిషి సార్ వచ్చాడు అనడంతో ప్రేమగా వసుధార బయటకి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్లిపోమని చెప్పాను కదా ఇదంతా నీవల్లే జరుగుతుంది ఇక్కడి నుంచి పంపించు అని అంటుంది వసుధార. అప్పుడు రాజీవ్ నేను చెప్తే తను వెళ్తాడా అని అంటాడు రాజీవ్. ప్లీజ్ ఏదో ఒకటి చేసే రిషి సార్ నీ ఇక్కడి నుంచి పంపించెయ్ అని అంటుంది. ఏం కాదులే వసుధార సమయానికి ఎస్ఐ సార్ కూడా ఇక్కడ లేరు వచ్చారంటే ఏదైనా ఎక్కువ మాట్లాడితే రిషిని కూడా జైల్లో వేస్తారు అని అంటాడు.

అదిగో చూసావు కదా ఎస్సై కూడా వచ్చారు అనడంతో వసుధర టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర రిషిని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు కోపం తెప్పియకు ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు ఎస్సై. అప్పుడు సార్ ప్లీజ్ ఒకే ఒక్క మాట అడుగుతాను అని అనడంతో చదువుకున్న వాడిలా ఉన్నావు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చావు ఎందుకు ఈ న్యూసెన్స్ అంతా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు ఉండడంతో ఎస్సై ని బ్రతిమలాడుతూ ఉంటాడు రిషి. అప్పుడు బయట వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా లోపల రాజీవ్,వసుధార ఇద్దరు ఆ మాటలు వింటూ ఉంటారు. అప్పుడు రాజీవ్ ఏంటి వసు మీ రిషి గారి మీద ప్రేమ పెరుగుతుందా అనడంతో రిషి సార్ కి నిజం చెప్పేస్తాను అనడంతో వసుధారకి రాజీవ్ వార్నింగ్ ఇస్తూ అక్కడ హాస్పిటల్లో మీ అమ్మానాన్న చావు బతుకుల మధ్య ఉన్నారు.
 

 కానీ ఇక్కడ మీ రిషి సార్ ప్రాణాలతో ఉండడు. ఆ విషయం గుర్తు పెట్టుకొని మాట్లాడు అంటూ వసుధారకి వార్నింగ్ ఇస్తాడు. మీ అమ్మానాన్నలు చనిపోయి రిషి సార్ చనిపోతే నువ్వు ఒంటరి అవుతావు అప్పుడు నీకు నేనే దిక్కు అని అంటాడు. అప్పుడు రాజీవ్ మాటలకి వసుధార భయపడుతూ ఉంటుంది. మరోవైపు బయటే ఎస్ఐ పెళ్లి అయిన అమ్మాయిని ప్రేమించడమేంటి అతను ఎంత బాధ పడుతాడో అనడంతో వాడొక పెద్ద ఫ్రాడ్ వాడిని నమ్మకండి సర్ అని అంటాడు. ఇప్పుడు రిషి ఎంత బ్రతిమలాడిన ఎస్ఐ వినిపించుకోకుండా లోపలకి వెళ్తాడు. లోపలికి వెళ్లి వసుధార మీద సీరియస్ అవుతాడు. అతను వెళ్ళాడు ఏమో చూడండి అని కానిస్టేబుల్ అనడంతో వెళ్లలేదు సార్ అని అంటారు. వీళ్ళతో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది అతన్ని లోపలికి పిలిపించండి అని అంటాడు.
 

రిషి లోపలికి రావడంతో వసుధార ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అప్పుడు రిషి ఒకేఒక్క మాట చెప్పు వసుధార నీ మెడలో ఆ తాళి ఎవరు కట్టారు అని అడుగుతాడు. అప్పుడు వసు నా ఇష్టంతోనే తాళి నా మెడలో పడింది అనడంతో రిషి షాక్ అవుతాడు. నా ఇష్టంతోనే పెళ్లి జరిగింది నేను ఇంతకంటే చెప్పాల్సింది మరేమీ లేదు అని అంటుంది వసుధార. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి దయచేసి మళ్ళీ ఇక్కడికి రావద్దు అండి అని అనడంతో రిషి బాధ పడుతూ ఉంటాడు. చేతులు జోడించి దయచేసి మీరు ఎప్పటికీ ఇక్కడికి రావద్దు అని అనడంతో రిషి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయటికి వెళ్లిన రిషి వసుధార అన్నమాటలు తలుచుకొని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార జైల్లో గోడపై రిషిధార అని రాసి దాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. మరొక వైపు రిషి కార్లు వెళ్తూ వసుధార అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. వసు ఆ పేరుని చూసి బాధపడుతూ ఉంటుంది.

click me!