Karthika Deepam: దీపను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సౌందర్య.. ఒక్కటైన కార్తీక్, హిమ,శౌర్య?

First Published Jan 9, 2023, 7:41 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో కార్తీక,దీప ఇద్దరూ మోనిత అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎలా ఈ మోనిత పీడ విరగడ అయ్యేలా చేయాలి? దాన్ని చూస్తే వదిలిపెట్టేలా లేదే అని దీప ఆలోచిస్తూ ఉండగా, మరోవైపు గదిలో కార్తీక్ ఎలా అయినా మోనితను ఇక్కడికి రాకుండా చేయాలి. దీపకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దీప ఆలోచిస్తూ ఒక్కసారిగా డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది దీప అనడంతో మొదటిసారిగా నాకు భయం వేస్తుంది డాక్టర్ బాబు అని అంటుంది. మీరు నా నుంచి దూరమైనప్పుడు గాని నాకు దూరంగా ఉన్నప్పుడు గాని భయపడలేదు కానీ మోనిత అన్న మాటలు విన్న తర్వాత నాకు భయమేస్తుంది డాక్టర్ బాబు అంటుంది దీప.
 

అప్పుడు కార్తీక్ ఆ మోనిత గురించి నీకు తెలిసిందే కదా నిన్ను భయపెట్టి నిన్ను బాధ పెట్టడమే దాని పని అందుకే ఇలా చేస్తుంది నువ్వు ఏం ఆలోచించకు అని అంటాడు.   అప్పుడు దీప ఏడుస్తూ ఆ మోనిత సంగతి మీకు తెలియదు డాక్టర్ బాబు అది ఎంతకైనా తెగిస్తుంది నేను చనిపోయిన తర్వాత అది నిన్ను స్విజర్లాండ్ కి తీసుకెళ్తుంది అని బాధపడుతుంది. అప్పుడు దీప నేను చనిపోయిన తర్వాత మీరు ఏమైపోతారా అని నా ఆలోచన డాక్టర్ బాబు నేను చనిపోతే అని అనగా దీప నీకి ఎన్నిసార్లు చెప్పాలి పదేపదే ఆ మాట మాట్లాడకు అని అంటాడు కార్తీక్. మరి ఇంకెలా మాట్లాడాలి డాక్టర్ బాబు నాకు చనిపోవడం ఏమైనా సరదానా అంటూ కార్తీక్ చేతులు పట్టుకొని నన్ను బతికించండి డాక్టర్ బాబు మీతో కలిసి బతకాలని ఉంది అంటూ కార్తీక్ చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది దీప.
 

అప్పుడు కార్తీక్ దీపని ఓదారుస్తూ ఉంటాడు. మరొకవైపు సౌందర్య నిద్ర లేస్తుంది. లేచి దేవుని ప్రతిరోజు నిన్ను కోరుకునేది ఒకటే దేవుడా నా కొడుకు కోడలు అంటూ ఉంటే నాకు కనిపించేలా చెయ్యి అని అక్కడి నుంచి బయటికి వెళుతుంది. బయట దీప కూర్చుని ఉండటంతో అక్కడికి వెళుతుంది సౌందర్య. అప్పుడు దీపని చూసి ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళిపోయావు అని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది సౌందర్య. మా ఇన్నాళ్ల నిరీక్షణ పలించింది. మీరు తిరిగి వస్తారని అనుకోలేదు. అసలు మీరు ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నారే అని అంటుంది. అప్పుడు సౌందర్య లోపలికి వెళ్దాం రా దీప అని అనగా ఇప్పుడు కాదు అత్తయ్య తరువాత వస్తాను అని అనడంతో అదేంటి పిల్లలకు కనిపించకూడదు అనుకుంటున్నావ అనగా నేను తరువాత వస్తాను ఫస్ట్ నేను మీతో చాలా మాట్లాడాలి అత్తయ్య అని అంటుంది దీప.
 

నీకోసం మీ కూతురు ఇద్దరు పిచ్చి వాళ్ళలా వెతుకుతున్నారు అని సౌందర్య అనడంతో నాకు మొత్తం తెలుసు అత్తయ్య అనగా తెలిసే ఉంటుంది అందుకే కదా ఇంటికి వచ్చావు అని అంటుంది సౌందర్య. మేము వచ్చిన విషయం మేము మిమ్మల్ని వెతుకుతున్న విషయం అన్నీ తెలుసు మీమంటే నీకు ప్రాణం పిల్లలు అంటే నీకు సర్వస్వం అయినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ దీప అని నిలదీస్తుంది సౌందర్య. కార్తీక్ బాగున్నాడా ఫస్టు ఆ విషయం చెప్పు అనడంతో ఆయన బాగానే ఉన్నాడు ఆయనకు తెలియకుండా ఇక్కడే వచ్చాను అనగా అదేంటి దీప అనడంతో వాళ్ళు ఎందుకు రాలేదు మీరు ఇన్ని రోజులు కనిపించక టెన్షన్ పడ్డాము ఇప్పుడు మీరు ఉన్నారని తెలిసింది.
 

 నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళు అనడంతో తీసుకెళ్తాను ఫస్ట్ నువ్వు నాకు మాట ఇవ్వాలి అత్తయ్య నేను ఏం చేసినా మన మంచికే చేస్తాను కదా అని అంటుంది దీప. సరే అని సౌందర్య దీపకు మాట ఇస్తుంది. నేను వచ్చినట్టు ఇప్పుడప్పుడే పిల్లలకు చెప్పకండి. సరే అత్తయ్య నేను వెళ్ళొస్తాను అనడంతో అదేంటి దీప ఏదో పక్కింటి వాళ్ళలా వచ్చి రెండు మాటలు మాట్లాడించి వెళ్ళిపోతున్నావు. అలా ఎలా వదిలేస్తాను అనుకున్నావే అని అంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో చెప్పు దీప అని నిలదీస్తుంది సౌందర్య. అప్పుడు దీప సౌందర్యని పిలుచుకొని పక్కకు వెళుతుంది. మరొకవైపు మోనిత కార్తీక్ ఫోటోలు చూసి మురిసిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి చారుశీల కాఫీ తీసుకొని వస్తాడు.
 

ఏం చూస్తున్నావ్ మోనిత అనగా నా కార్తీక్ ని చూస్తున్నాను చూడు ఎంత అందంగా ఉన్నాడో అని అనడంతో ఈ మోనిత జైల్లో ఉంటే నేను కార్తీక్ ని దక్కించుకుందాం అనుకుంటే బయటికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది చారుశీల. అప్పుడు ఏంటి చారుశీల నాకు పోటీగా వద్దామని అనుకుంటున్నావా అనడంతో చారుశీల ఒక్కసారిగా షాక్ అవుతుంది. మాట్లాడుతున్నావు మోనిత అనగా ఇది నీ ఫోనే నీ ఫోన్లో ఇన్ని ఫోటోలు కార్తీక్ వి ఎందుకు ఉన్నాయి ఇన్ని రోజులు పరిచయంలో నా దగ్గరే అన్ని కార్తీక్ ఫోటోలు లేవు ఏంటి కథ అని అంటుంది మోనిత. నేనే ఆ దీప  నుంచి నా కార్తీక్ ని ఎలా లాగేసుకోవాలా అని ప్రయత్నిస్తుంటే నా కార్తీక్ కే గాలం వేసి నా నుంచి లాగేసుకోవాలని చూస్తున్నావా అనడంతో, మోనిత నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది చారుశీల.
 

 కార్తీక్ కోసం ఆరాటపడుతున్నావేమో చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది మోనిత. ఇప్పటికే కార్తీక్ ప్రాణం తీసి జైలుకు వెళ్లొచ్చాను ఇంకొకరి ప్రాణం తీయడం నాకేం పెద్ద లెక్క కాదు గుర్తుంచుకో అని చారుశీల కు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది మోనిత. మరొకవైపు హిమ, సౌర్య ఇద్దరూ రోడ్డుపై కార్తీక్ దీపల కోసం అందరిని అడుగుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ కూడా అదే రూట్లో వస్తూ ఒకచోట నిలబడి ఎక్కడికి వెళ్ళిపోయావు దీప నీకేమైనా అయితే నేనేం అవ్వాలి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళావా లేదంటే మోనిత దగ్గరికి వెళ్ళావా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హిమ,సౌర్య వెళుతూ ఉండగా అప్పుడు హిమ సౌర్య చాక్లెట్లు కొనుక్కుందామా అనడంతో నాకు ఇప్పుడు వద్దు..

ఇప్పుడు నాకు తినే మూడు లేదు హిమపై సౌర్య సీరియస్ అవ్వగా ఇంతలోనే ఒక దొంగ వచ్చి హిమ ఉన్న డబ్బులు లాక్కొని పారిపోయి దూరంగా నెట్టేయడంతో సౌర్య హిమ కింద పడిపోకుండా కార్తీక్ పట్టుకుంటాడు. అప్పుడు కార్తీక్ ని చూసి హిమ,శౌర్య షాక్ అవుతారు. అప్పుడు హిమ సౌర్య, కార్తీక్ నీ హత్తుకొని ఏడుస్తూ ఉంటారు.అప్పుడు కార్తీక్ కూడా వాళ్ళనీ చూసి ఎమోషనల్ అవుతాడు.

click me!