బిగ్ బాస్ బ్యూటీ అరియానాపై పడిన వర్మ కన్ను... మరో అప్సరరాణి, శ్రీరాపాక, నైనా గంగూలీ కానుందా?

First Published Jun 5, 2021, 8:03 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్నుపడిన అమ్మాయి హీరోయిన్ అయిపోతుంది. సినిమా జోనర్, రేంజ్ సంగతి పక్కన పెడితే, అతి సామాన్యమైన అమ్మాయిలలో అందాలు గుర్తించి.. తన సినిమాలకు తగినట్లు వాడుకోవడంలో వర్మ దిట్ట. అలాగే వర్మ కాంపౌండ్ చేరిన హీరోయిన్స్ కి ఆయన వరుసగా అవకాశాలు ఇస్తాడు. ఆయన స్టార్ డైరెక్టర్ గా మంచి ఫార్మ్ లో ఉన్నప్పటి నుండి ఈ సాంప్రదాయం ఉంది. 
 

అప్పట్లో రంగీలా ఫేమ్ ఊర్మిళ, శ్రీదేవి వంటి హీరోయిన్స్ ని రిపీటెడ్ గా తన సినిమాలలో తీసుకునేవారు వర్మ. ఇక ఈ మధ్య వర్మ సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఇద్దరు ముగ్గురు హాట్ బ్యూటీలను దగ్గరకు తీశాడు. వాళ్ళతో తన వింత ఆలోచన తాలూకు సినిమాలు తీస్తూ సొమ్ము చేసుకున్నాడు. అదే సమయంలో వాళ్లకు కూడా ఉపాధి కల్పిస్తున్నాడు.
undefined
ఒకటి రెండు తెలుగు సినిమాలలో నటించిన హీరోయిన్ అంకిత మహారణా పేరు మార్చి అప్సర రాణి చేశాడు. ఆమెతో థ్రిల్లర్ అనే బోల్డ్ క్రైమ్ డ్రామా చేశారు. మరో హీరోయిన్ నైనా గంగూలీకి వంగవీటి, బ్యూటిఫుల్ వంటి చిత్రాలలో అవకాశాలు ఇచ్చాడు.
undefined
తాజాగా అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో లెస్బియన్ స్టోరీతో మరో మూవీ చేస్తున్నాడు. నగ్నం సినిమాతో అసలు ఎవరికీ పరిచయం లేని శ్రీ రాపాకను వెండితెరకు పరిచయం చేశాడు వర్మ.
undefined
కాగా బిగ్ బాస్ ఫేమ్ ఆరియానాకు కూడా వర్మ తన చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్మతో ఆరియానా చాలా సన్నిహితంగా ఉంటుండగా,  ఆమె లక్ తిరిగినట్లే అన్నమాట వినిపిస్తుంది.
undefined
ఇటీవల వర్మ ఇంటర్వ్యూ కోసం ఆయన నివాసానికి వెళ్లిన ఆరియానా... వర్మతో కలిసి వర్క్ ఔట్స్ చేసింది. జిమ్ వేర్ లో హాట్ గా ఉన్న ఆరియానా వర్మతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. వర్మ, ఆరియానా ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యాయి.
undefined
ఓ ఇంటర్వ్యూ ద్వారా వర్మకు ఆరియానాతో పరిచయం ఏర్పడింది. ఆరియానా అడిగిన ఓ ప్రశ్నకు వర్మ.. నిన్ను బికినీలో చూడాలని ఉందని షాకింగ్ సమాధానం చెప్పారు. ఆ ఇంటర్వ్యూ సూపర్ పాపులర్ కాగా ఆరియానా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.
undefined
ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ దక్కించుకున్నారు. ఫైనల్ కి చేరిన ఆరియానాను సప్పోర్ట్ చేయమని వర్మ సోషల్ మీడియాలో కోరుకోవడం విశేషం.
undefined
ఇక ఆరియానా అందం, స్నేహ సంబంధం కారణంగా వర్మ ఆమెకు తన నెక్స్ట్ చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం ఖాయమని టాలీవుడ్ వర్గాల బోగట్టా. దీని కోసమే వర్మతో ఆరియానా సన్నిహితంగా ఉంటున్నారని సమాచారం.
undefined
ఆరియానా గ్లోరీ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
ఆరియానా గ్లోరీ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
click me!