చిరు, వెంకీ, బాలయ్య, రానా, నాని సినిమాలన్నీ పోస్ట్‌పోన్‌.. మొత్తం గందరగోళం..స్టార్స్ మధ్య కొట్లాట తప్పదా?

First Published Apr 14, 2021, 10:06 PM IST

కరోనా కారణంతో స్టార్‌ హీరోల సినిమాలన్నీ పోస్ట్ పోన్‌ అవుతున్నాయి. చిరంజీవి, వెంకీ, బాలయ్య, రానా, నాని సినిమాలు వాయిదా పడుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లో పెద్ద గందరగోళం నెలకొనబోతుంది. బాక్సాఫీసు వద్ద స్టార్‌ హీరోల మధ్య కొట్టాట తప్పేలా లేదు. 

కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. థియేటర్లలో ఆక్యుపెన్సీ 50శాతం చేసే ఆలోచనలో ప్రభుత్వాలున్నాయి. జనాలు థియేటర్‌కి వచ్చే అవకాశం తగ్గిపోనుంది. దీంతో స్టార్‌ హీరోల సినిమాలు వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు ఏపీలో టికెట్లు రేట్లు తగ్గించింది ప్రభుత్వం. దీంతో సినిమాలపై ఇది మరింత ప్రభావం పడబోతుంది. ఈ కారణాలతో చాలా వరకు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ్‌ మొత్తం ఇప్పుడు డిస్టర్బ్ కాబోతుంది. ఇది త్వరలో హీరోల మధ్య థియేటర్ల కొట్టాటకు దారితీయబోతుంది.
undefined
ఈ నెల 16న విడుదల కావాల్సిన నాగచైతన్య, సాయిపల్లవి నటించిన `లవ్‌స్టోరి` వాయిదా పడింది. ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. బహుశా ఇది కోవిడ్‌ ప్రభావం తగ్గాక విడుదల చేసే అవకాశం ఉంది.
undefined
మరోవైపు ఈ నెల 23న విడుదల కావాల్సిన నాని `టక్‌ జగదీష్‌` సినిమా కూడా వాయిదా పడింది. ఏపీలో టికెట్ల రేట్ల తగ్గించడం కూడా వాయిదాకి కారణం. దీంతో సినిమాని వాయిదా వేయడంతోపాటు ఉగాది సందర్భంగా విడుదల చేయాల్సిన ట్రైలర్‌ని కూడా వాయిదా వేసుకున్నారు. ఈవెంట్‌ని కూడా కాన్సిల్‌ చేశారు.
undefined
అలాగే ఈ నెల 30న విడుదల కావాల్సిన రానా, సాయిపల్లవిల `విరాటపర్వం` చిత్రాన్ని తాజాగా పోస్ట్ పోన్‌ చేసింది చిత్ర బృందం. నక్సల్‌ ప్రధానంగా కామ్రేడ్‌ రవన్న జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాని కరోనాతోనే వాయిదా వేశారు. ఈ సినిమా కూడా జులై తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.
undefined
మరోవైపు మే ఒకటిన విడుదల కావాల్సిన `పాగల్‌` చిత్రం కూడా వాయిదా పడే అవకాశాలున్నాయనే టాక్‌ వినిపిస్తుంది. కాకపోతే దీనిపై ఇంకా క్లారిటీ లేదు.
undefined
మే 13న మెగా స్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లు నటించిన `ఆచార్య` చిత్రం సైతం వాయిదా పడబోతుందని తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మళ్లీ జులై తర్వాతే, అంటే కరోనా ప్రభావం తగ్గిన తర్వాతనే, అలాగే టికెట్లు రేట్స్ సెట్‌ అయ్యాకనే రిలీజ్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నారు.
undefined
వెంకటేష్‌ హీరోగా నటించిన `నారప్ప` సినిమా మే 14నే విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే టికెట్ల రేట్లు తగ్గడం విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.
undefined
ఆ తర్వాత విడుదల కావాల్సిన సందీప్‌ కిషన్‌ `గల్లీరౌడీ` సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. మే 21న విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఇది కూడా రిలీజ్‌ అవుతుందా? చివరి నిమిషంలో డ్రాప్‌ అవుతుందా? అనే డౌట్‌ నెలకొంది.
undefined
దీంతోపాటు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న `అఖండ` చిత్రం వాయిదా పడబోతుందనే టాక్‌ వైరల్‌ అవుతుంది. ఇది మే 28న విడుదల అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్‌ మారే అవకాశం ఉందట. అందుకే తాజాగా విడుదల చేసిన టీజర్‌లో సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించలేదు. ఇది కూడా ఆగస్ట్‌ తర్వాతే రిలీజ్‌కి రెడీ అయ్యే అవకాశం ఉంది.
undefined
మరోవైపు రవితేజ నటించిన `ఖిలాడి` సినిమా మే 28నే విడుదల కావాల్సి ఉంది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ దుమ్మురేపుతుంది.
undefined
ఒక రేంజ్‌ హీరోల నుంచి, స్టార్‌ హీరోల సినిమాలన్నీ వాయిదా పడబోతుంది. దాదాపు ఏప్రిల్‌, మే, జూన్‌ వరకు మొత్తం ఖాళీ కాబోతుంది. ఈ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్‌ అవుతాయనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ చిత్రాలన్నీ ఆ తర్వాత జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్, డిసెంబర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశాలున్నాయి. అంటే ఆ సమయంలో విడుదల కావాల్సిన సినిమాలతో ఇవి కూడా పోటీ పడబోతున్నాయని చెప్పొచ్చు.
undefined
ఇదే ఇప్పుడు పెద్ద గందరగోళానికి, అయోమయానికి గురి చేస్తుంది. స్టార్‌ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయితే అది థియేటర్లపై ప్రభావం పడుతుంది, కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. దీంతో నిర్మాతలు, సినిమాని కొన్నవాళ్లు నష్టపోయే ప్రమాదం ఉంది. ఓ రకంగా జులై తర్వాత టాలీవుడ్‌లో పెద్ద గందరగోళం నెలకొంటుందని, పెద్ద వివాదాలు నెలకొంటాయనే చర్చ జరుగుతుంది. స్టార్‌ హీరోల మధ్య థియేటర్ల కొట్లాట తప్పదనే టాక్‌ వినిపిస్తుంది.
undefined
గతేడాది సంక్రాంతికి ఒకేసారి మహేష్‌బాబు `సరిలేరు నీకెవ్వరు`, అల్లు అర్జున్‌ `అల వైకుంఠపురములో` సినిమాల విడుదల విషయంలో పెద్ద వివాదం నెలకొంది. ఇలాంటి వివాదాలే మున్ముందు నెలకొనబోతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా టాలీవుడ్‌ వరుసగా సినిమాలతో ఉక్కిరి బిక్కిరయ్యే ప్రమాదం ఉందని, చాలా ప్రమాదకరమని క్రిటిక్స్ అంటున్నారు. మరి దీన్ని హీరోలు, దర్శక, నిర్మాతలు ఎలా సరిచేసుకుంటారు. ఎలా ముందుకెళ్తారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ నెలకొంది.
undefined
ఇదిలా ఉంటే ఈ నెల మొత్తం పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` హవా కొనసాగబోతుంది. ఇప్పటికే సినిమా బడ్జెట్‌ డబ్బులు వచ్చేశాయి. ఈ నెల మొత్తం ఇక లాభాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. మొత్తంగా నిర్మాత దిల్‌రాజు, రీఎంట్రీ ఇచ్చిన పవన్ పంటపండబోతుందని చెప్పొచ్చు.
undefined
click me!