పవన్,ఎన్టీఆర్, చిరు, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, చరణ్... ఖాళీ దొరికితే ఈ స్టార్స్ చేసే పనులు తెలుసా!

First Published May 25, 2021, 3:54 PM IST


స్టార్ హీరోలకు అస్సలు తీరిక ఉండదు. షూటింగ్స్, మీటింగ్స్, ఈవెంట్స్, స్టోరీ సిట్టింగ్స్ ఇలా అనేక వ్యవహారాలు వారి దినచర్యలో భాగంగా ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే స్టార్స్ కి ఖాళీ సమయం దొరుకుతుంది. అరుదుగా దొరికే ఆ కొద్ది సమయంలో తమకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్టార్స్. మరి మన టాలీవుడ్ స్టార్స్ అయిన చిరంజీవి, పవన్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ ఖాళీ సమయాల్లో ఏమీ చేస్తుంటారో చూద్దాం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాళీ సమయం దొరికితే ఇంటికే పరిమితం అవుతున్నారు. కుటుంబంతో వివహారాలకు కూడా చాలా తక్కువ వెళుతూ ఉంటారు ఆయన. కుటుంబ సభ్యులతో ఖాళీ సమయాన్ని గడపడానికి ఇష్టపడే ఎన్టీఆర్ కి వంట చేయడం అంటే మహా ఇష్టం. ప్రియమైన వారికి స్వయంగా తన చేతి వంట రుచిచూపించడం ఎన్టీఆర్ కి మహా సరదా అట. ఈ విషయంలో ఆయన ప్రొఫెషనల్ కూడా.
undefined
సూపర్ స్టార్ మహేష్ కి ఇష్టమైన వ్యాపకాలలో టూరింగ్ ఒకటి. ప్రతి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు, ముగిసిన తరువాత ఫామిలీతో వరల్డ్ ట్రిప్ కి వెళుతూ ఉంటారు. ఇంట్లో ఉంటే పిల్లలతో సరదాగా గడపడం, పుస్తకాలు చదవం, హాలీవుడ్ మూవీస్ చూడడం చేస్తారట.
undefined
మెగాస్టార్ చిరంజీవికి వంట చేయడం ఇష్టమైన వ్యాపకం. అది కూడా చిన్నతనంలో అమ్మ చేసి పెట్టిన పల్లె రుచులు ఆయన ట్రై చేస్తూ ఉంటారు. తాను చేసిన వంట తల్లి అంజనా దేవికి స్వయంగా తినిపించడం ఆయనకు ఇష్టమైన చర్య.
undefined
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఖాళీ సమయాన్ని ఎక్కువగా విహారాలకు వినియోగిస్తారట. మిత్రులతో కలిసి జాలి టూర్స్ వేయడం ఆయనకు సరదా. కోడిపందేలు, వాలీ బాల్ ఆడడం ప్రభాస్ కి మహా సరదా అని వినికిడి.
undefined
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుస్తకాల పురుగు అన్న విషయం తెలిసిందే. సెట్స్ లో కూడా షాట్ గ్యాప్ లో ఆయన ఇష్టమైన పుస్తకం చదువుకుంటూ ఉంటారు. ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం, పశువుల పెంపకం పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టం.
undefined
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అంటే పిచ్చ ప్రేమ కలిగి ఉంటారు. ఏమాత్రం విరామం దొరికిన పిల్లలతో ఆదుకోవడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. కూతురు బుల్లి బుల్లి మాటలను, అల్లరిని ఎంజాయ్ చేస్తూ, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.
undefined
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తండ్రి చిరంజీవి మాదిరి వంట చేయడం ఇష్టమైన వ్యాపకం అట. అలాగే ఖాళీ సమయాలలో ఫార్మ్ హౌస్ కి వెళ్లి హార్స్ రైడింగ్ చేస్తారు రామ్ చరణ్.
undefined
హీరో రానాకు ఓ భిన్నమైన వ్యాపకం ఉందట. ఆయన ఖాళీ సమయాలలో ఇంట్లోని పనికి రాని వస్తువులను రీసైక్లింగ్ చేసే పనిలో నిమగ్నం అవుతారట.
undefined
మరో సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు పురాతన వస్తువులు సేకరించడం హాబీ అట. ఖాళీ సమయాలలో ఆయన అదే పనిలో ఉంటారట.
undefined
సాహిత్యం, పురాణ పఠనం బాలకృష్ణ ఇష్టమైన చర్యలు. అలాగే తండ్రి ఎన్టీఆర్ గారి చిత్రాలు చూస్తూ గడపడం ఆయనకు మహా ఆనందం కలిగించే విషయం అని సమాచారం.
undefined
click me!