అల్లు రామలింగయ్య చేసిన కుట్ర బయటపెట్టిన చిరంజీవి.. గొర్రెపొటేలుని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని వ్యాఖ్య

First Published Oct 2, 2022, 8:05 AM IST

చిరంజీవి.. తన పెళ్లి వెనకాలు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్‌ చేసిన కుట్రని బయటపెట్టారు. గొర్రపొటేలుని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని చెప్పి షాకిచ్చారు. 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పలు హాట్‌ కామెంట్లు, ఇంట్రెస్టింగ్‌ వ్యాఖ్యాలుచేశారు. చిరు మాట్లాడుతూ, అల్లు రామలింగయ్యని ఒక వ్యక్తి అనుకోను.. నడిచే ఎన్‌ సైక్లోపీడియా అనుకుంటా. ఎన్నో పార్శ్యాలున్న బహుముఖ శాలి. ఆయనతో నాకున్న అనుబంధం ఇక్కడున్న ఎవరికీ లేదు. బహుశా ఆయన తనయుడు అల్లు అరవింద్‌ కూడా లేదు. నటుడిగా ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం, ఎక్కువ సినిమాలు చేసే అవకాశం నాకు దక్కింది. ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోగలిగాను. 
 

అల్లు రామలింగయ్యతో తొలి పరిచయం `మనవూరి పాండవులు`టైమ్‌లో 1998 మే ఆ ప్రాంతంలో ఎర్రటి ఎండలో రాజమండ్రిలో షూటింగ్‌ చేస్తున్న సమయంలో జరిగింది. ఆయన్ని ఆటపట్టించే సన్నివేశాలతో షూటింగ్‌ మొదలైంది. ఆయన్ని పట్టుకుంటుంటే ఏంటయ్య గట్టిపట్టుకుంటున్నావేంటి? అంటూ కోపగించుకునేవారు. ఎలా పట్టుకోవాలో తెలియదు, ఎలా పట్టుకున్నా కేకలేసేవారు. బాబోయ్‌ ఈయనతో కష్టమే అనుకున్నాం. ఆ టైమ్‌లోనే ఏ వూరు బాబూ అంటూ అడిగాడని, తాము చాలా ఊర్లు తిరిగామని చెప్పా. అయితే అప్పుడు చాలా మంది నటులున్నా, ఆయన దృష్టి నాపైనే ఉందని తర్వాత తెలిసింది( సురేఖ(Surekha)ని చూపిస్తూ నవ్వుతూ..)

ఏదో తనని గమనిస్తున్నాడని భావించాగానీ, ఆయనలో మరో కోణం ఉందని తాను గమనించలేకపోయా. తర్వాత మురళీ మోహన్‌ చెబితే అర్థమైంది. ఆ తర్వాత మద్రాస్‌ కి వస్తుంటే ట్రైన్‌లో ఒకే కంపార్ట్ మెంట్లో కూర్చున్నాం. అందులో రావుగోపాల్‌రావు, ఆయన, మరికొంత మంది ఉన్నారు. వాళ్లు మందు బాటిల్‌ ఓపెన్‌ చేసుకుని తాగుతున్నారు. నన్ను ఓ పెగ్‌ వేయమని అడిగారు. నాకు అలవాటు లేదని, భోజనం చేసినట్టు చెప్పారు. అయితే అక్కడ తన గురించి ఓ మార్క్ టిక్‌ చేసుకున్నారని చెబుతూ కామెడీని పండించారు.

మరో చోట గీత అనేఅమ్మాయిఉంటే అందరు ఆమెతో మాట్లాడుతున్నారని, కానీ నేను హార్స్ రైడింగ్‌ చేస్తున్నానని, అప్పుడు తనని చూసి ఇంకో మార్క్ ఏసుకున్నారని చెప్పారు చిరు. ఆ టైమ్‌లోనే తనపై కుట్ర జరిగింది. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్‌, జయకృష్ణ వంటి వారంతా కూర్చొని ఈ కుట్ర చేశారని, ఈ కుర్రాడినిఎలా నొక్కేద్దామా అని ప్లాన్‌ చేశారని తెలిపారు. ఆ తర్వాత నిర్మాత జయకృష్ణ వచ్చి తనని పెళ్లి గురించి అడిగారు, తనకు ఇష్టం లేదని, ఇప్పుడే కెరీర్‌ స్టార్ట్ అవుతుంది. సినిమాలొస్తున్నాయి. మరో ఆరేడు ఏళ్లు పెళ్లి ప్రస్తావన లేదని చెప్పా. 

కానీ ఆయన మా నాన్నగారిని కలిసి మాయ మాటలు చెప్పారు. కమల్‌ హాసన్‌ని మించిన అందం మీ అబ్బాయిది. అమ్మాయిలు ఎగబడుతున్నారు. ఏదో జరగొచ్చు. ఏ అమ్మాయి ఏంచేస్తుందో తెలియదు, అబ్బాయిని కాపాడుకోవాలి. పైగా చిక్కిపోతున్నాడు. ఇంటి భోజనం చేస్తే బాగుంటుంది, మనకు తెలిసిన సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి ఉంది. (అమాయకురాలు నోట్లో వేలు పెట్టినా కొరకదు అన్నారు. ఆ తర్వాత తన పీకకొరికిందని సరదా వ్యాఖ్య) మీరు ఓకే అంటేసెట్ చేద్దామని నాన్నతో జయకృష్ణ మాట్లాడారు. దీంతో నాన్నగారు నన్ను అడిగారు. నేను నో చెప్పాను. ఇప్పుడు వద్దన్నాను. కానీ ఏదో పెళ్లి చూపులకని పిలిచారు. ఎప్పుడైతే సురేఖని చూశానో.. అంతా దిగిపోయిందని నో చెప్పలేకపోయానని చెప్పాడు. 
 

ఆ తర్వాత మరోసారి టీ కోసమని ఇంటికి పిలిచారు. ఈసారిఎలాగైనా నో చెప్పాలని, `ఊ అంటావా ఊఊ అంటావా` అనే రేంజ్‌లో వెళ్లాను. కానీ అక్కడకు వెళ్లాక ఆ టీ పెట్టింది సురేఖ. అందులో ఏ మందు కలిపిందో తెలియదు. అది తాగాక ఊఊ అనలేకపోయా, ఊ అనేశా అంటూ నవ్వులు పూయించారు చిరంజీవి. నేను కళ్లు తెరిచే సరికి పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లికి పెద్ద తతంగం జరిగిందని చెప్పారు. అల్లు రామలింగయ్యనేమో అనుకున్న రెండు నెలల్లో పెళ్లి చేసేయాలంటారు. నాకేమో మే వరకు బిజీ షెడ్యూల్‌. ఒక్క రోజు కూడా గ్యాప్‌ లేదు. ఇప్పుడొదిలేస్తే జారిపోతాడేమో అని అల్లు అరవింద్..ఎంఎస్‌ రెడ్డి వద్ద కూర్చొని మూడు రోజులు సంపాదించాడు. 

ఒకటి పెళ్లి కొడుకు చేయడానికి, రెండు పెళ్లి చేయడానికి, మూడో అదేదో చేస్తారుగా అంటూ తనదైన స్టయిల్‌లో నవ్వులు పూయించారు. అయిపోయింది పెళ్లి కూడా చేసుకున్నా. ఎవడో అన్నాడు షర్ట్ చినిగిపోయిందని. చిరిగితే ఏంటంటా అని నేను వాడిపై చిరాకు పడ్డాను. అంతా అయిపోయాక రామలింగయ్య గారి ముఖం కళకళలాడుతుంది. నా మొఖం మాత్రం మాడిపోయినట్టుంది. పసివాడిని పట్టేశారుగా అని. మొత్తానికి అంతా అయిపోయింది. సురేఖతో ఎలాంటి రిగ్రెట్స్ లేవు. మంచి అనుబంధం ఏర్పర్చుకున్నాను. అల్లు రామలింగయ్యగారు తనని ఓ కొడుకులా చూసుకున్నారు.
 

రామలింగయ్యకి ఇద్దరు కొడుకులున్నారు. ఒకరిని నిర్మాతని చేయాలని, మరొకరిని నటుడిని చేయాలనుకున్నారు. కానీ మరో కొడుకు చనిపోయాడు. ఆ స్థానంలో నన్ను ఊహించుకున్నారు. మరో కొడుకులా భావించారని తెలిపారు చిరు. అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, ఈ విషయాలను వెల్లడించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగడం విశేషం. ఈ విషయాలన్నీ ఆయన సరదాగా చెప్పడం మరో విశేషం. ఇందులో అల్లు అర్జున్‌, అల్లు స్నేహారెడ్డి, అల్లు రామలింగయ్య, అల్లు శిరీష్‌, బాబీ, రావురమేష్‌, బ్రహ్మానందం, త్రివిక్రమ్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.
 

click me!