చిరంజీవి, రజనీ, పవన్‌, విజయ్‌, మహేష్, ప్రభాస్‌..ఈ సౌత్‌ స్టార్స్ అసలు పేర్లేంటో తెలుసా ?

First Published Dec 10, 2020, 1:25 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, రజనీకాంత్‌, కమల్‌, విజయ్‌, సూర్య, మమ్ముట్టి వంటి స్టార్‌ హీరోలు సౌత్‌ చిత్ర పరిశ్రమలను ఏలుతున్నారు. అగ్ర కథానాయకులుగా రాణిస్తున్నారు. కానీ తెరపైకి రాకముందు వారి అసలు పేర్లేంటో తెలుసా? ఆశ్చర్యానికి గురి చేసే వారి పేర్లేంటో ఓ లుక్కేద్దాం. 

తెలుగులో అగ్ర హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఉంటారు. ఆయన చిరంజీవిగా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి బేస్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్‌. చిరంజీవిగా పేరు మార్చుకుని ఇప్పుడు టాలీవుడ్‌ని ఏలుతున్నారు.
undefined
తెలుగులో పేరు మార్చుకున్న హీరోల్లో మోహన్‌బాబు కూడా ఉన్నారు. ఆయన మంచు భక్తవత్సలనాయుడిగా జన్మించారు. సినిమాల్లోకి వచ్చాక ఆయన మోహన్‌బాబుగా మార్చుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా విలక్షణ నటుడిగా, కలెక్షన్‌ కింగ్‌గా రాణిస్తున్నారు.
undefined
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌గా పాపులర్‌ అయిన పవన్‌ అసలు పేరు కొణిదెల కళ్యాణ్‌బాబు. కానీ ఆయన తొలి సినిమాతోనే తన పేరుని పవన్‌ కళ్యాణ్‌గా మార్చుకున్నారు. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌తో, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాయి.
undefined
ఇక రెబల్‌ స్టార్‌గా పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా, `బాహుబలి`తో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన ప్రభాస్‌ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు. సింపుల్‌గా ప్రభాస్‌ పేరుతో హీరోగా రాణిస్తున్నారు. టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్నారు.
undefined
తండ్రి కృష్ణ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తాను సూపర్‌ స్టార్‌గా ఎదిగారు మహేష్‌బాబు. సూపర్‌ స్టార్‌ మహేష్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న మహేష్‌ కూడా పేరు మార్చుకున్నారు. ఆయన అసలు పేరు మహేష్‌ ఘట్టమనేని. కానీ తెరపై మహేష్‌బాబుగానే పిలిపించుకుంటున్నారు. తమిళంలో సూపర్‌ స్టార్‌ ఎవరని అంటే ఠక్కున్న గుర్తొచ్చేది రజనీకాంత్‌. ఆ పేరుకు న్యాయం చేయడంతోపాటు, దానికో ఇమేజ్‌ని, గుర్తింపుని తీసుకొచ్చిన నటుడు రజనీకాంత్‌. ఆయన అసలు పేరు శివాజీ రావు గౌక్వాడ్‌ అనే విషయం అందరికి తెలిసిందే. బస్‌ కండక్టర్‌ నుంచి హీరోగా మారి తమిళనాట తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఈ వయసులోనూ రెట్టింపు ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
undefined
తమిళంలో సూపర్‌ స్టార్‌ ఎవరని అంటే ఠక్కున్న గుర్తొచ్చేది రజనీకాంత్‌. ఆ పేరుకు న్యాయం చేయడంతోపాటు, దానికో ఇమేజ్‌ని, గుర్తింపుని తీసుకొచ్చిన నటుడు రజనీకాంత్‌. ఆయన అసలు పేరు శివాజీ రావు గౌక్వాడ్‌ అనే విషయం అందరికి తెలిసిందే. బస్‌ కండక్టర్‌ నుంచి హీరోగా మారి తమిళనాట తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఈ వయసులోనూ రెట్టింపు ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
undefined
యూనివర్సల్‌ స్టార్‌గా, లోకనాయకుడిగా, విలక్షణ నటుడిగా, ప్రయోగాలకు కేరాఫ్‌గా, సినిమాకి డిక్షనరీగా నిలిచిన కమల్‌ హాసన్‌ సైతం పేరు మార్చుకున్నారు. ఆయన పుట్టినప్పటి పేరు పార్థసారథి శ్రీనివాసన్‌. సినిమాల్లోకి వచ్చాక కమల్‌ హాసన్‌గా పేరు మార్చుకున్నారు.
undefined
తమిళనాట స్టార్‌గా రాణిస్తున్న వారిలో విజయ్‌ కూడా ఉన్నారు. నటుడు చంద్రశేఖర్‌ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన అసలు పేరు జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌. సినిమాల్లోకి వచ్చాక విజయ్‌గానే పిలిపించుకుంటూ తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్నారు.
undefined
తమిళంలో మరో స్టార్‌ హీరో సూర్య కూడా పేరుని మార్చుకున్నారు. ఆయన అసలు పేరు శరవణన్‌ శివకుమార్‌. సూర్యపేరుతో హీరోగా పాపులర్‌ అయ్యారు.
undefined
రజనీ అల్లుడు, స్టార్‌ హీరో ధనుష్‌ ది కూడా అసలు పేరు కాదు. ఆయన అసలు పేరు వెంకటేష్‌ ప్రభు కస్తూరి రాజా. సింపుల్‌గా ధనుష్‌గా మార్చుకుని తమిళంలో స్టార్‌గా రాణిస్తున్నారు. విలక్షణ సినిమాలతో దూసుకుపోతున్నారు.
undefined
మలయాళంలో మెగాస్టార్‌గా రాణిస్తున్న మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్‌ కుట్టి పనపరంబిల్‌ ఇస్మాయిల్‌. తొలుత సాజిన్‌గా పిలిపించుకున్న ఆయన ఆ తర్వాత తన పేరుని మమ్ముట్టిగా మార్చుకుని పాపులర్‌ అయ్యారు. మాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఎదిగారు.
undefined
`కేజీఎఫ్‌`తో కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాని చాటడంతోపాటు కన్నడనాట తిరుగులేని స్టార్‌గా ఎదిగిన హీరో యష్‌. కన్నడకు చెందిన భువనహల్లి కమ్యూనిటీలో జన్మించిన ఆయన అసలు పేరు నవీన్ కుమార్‌ గౌడ. యష్‌గా పేరు మార్చుకుని శాండల్‌వుడ్‌ని ఏలుతున్నారు.
undefined
click me!