Guppedantha Manasu: రాజీవ్ పై సీరియస్ అయిన చక్రపాణి.. దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రాజీవ్?

First Published Jan 21, 2023, 9:23 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 21 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ ల్ప్ ఫణీంద్ర జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పు అనడంతో జరిగిన దాంతో గుణపాఠమైన నేర్చుకోవాలి కదా అంటుంది. నువ్వేం మాట్లాడవేంటి జగతి అనగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఒక జరిగినవన్నీ మీకు తెలుసు కదా అంటుంది. నాకు తెలిసి కూడా నేను ఏం చేయగలుగుతున్నాను ఎన్ని రోజులు మీరు ఆడిందే పాట పాడిందే పాట మహేంద్ర నీకు రిషి కాలేజీలో ఉన్నాడని ఎవరు చెప్పారు అనడంతో అప్పుడు వసుధార పెట్టిన వాయిస్ మెసేజ్ వినిపించడంతో దేవయాని షాక్ అవుతుంది. మనం ఇంట్లో ఇంతమంది ఉన్నాము మహేంద్ర కు అలాగే మనకు ఆ వసుధార రిషి ని పట్టించుకోమని హింట్ ఇస్తోందా అని కోపంతో మాట్లాడుతుంది.
 

 చిన్నప్పుడు జగతి రిషినీ వదిలిపోయినప్పుడు రిషి బాగా చూసుకున్నాను. ఇప్పుడు అదే జగతి తీసుకువచ్చిన శిష్యురాలు రిషిని బాధపెట్టి మన కుటుంబాన్ని అతలాకుతలం చేస్తోంది అని అంటుంది దేవయాని. అప్పుడు మహేంద్ర వదిన రిషి కాస్త గాయపడ్డాడు కోలుకోవాలి కదా అనగా ఎలా కోరుకుంటాడు మహేంద్ర ప్రతి సారి గాయపడుతూనే ఉన్నాడు అంటుంది. సాక్షి నీ ఇచ్చి పెళ్లి చేద్దామంటే మీరు నన్ను ఆపారు ఈరోజు వసుధార ప్రేమ గీమ అని చెప్పి రిషిని మోసం చేసింది అంటుంది. ఆ తరువాత రిషి ఫోన్ చేసి జగతిని కాలేజ్ కి రమ్మని చెప్పడంతో జగతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరొకవైపు చక్రపాణి సుమిత్రకు సేవలు చేస్తూ ఉండగా ఇంతలోనే రాజీవ్ ఫోన్ చేస్తాడు.

దాంతో రాజీవ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నమస్తే మావయ్య అనడంతో ఛీఛీ ఎవర్రా మామయ్య నీకు, దౌర్భాగ్యుడా అనడంతో ఏంటి మామయ్య మీరు అల్లుడు దేవుడు అన్న మీరే దౌర్భాగ్యుడు అంటున్నారా అని అంటాడు. పారిపోయి బతికిపోయి కానీ లేదంటే నిన్ను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మామయ్య గారు అని కూల్ గా మాట్లాడుతుండగా నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని నన్ను మోసం చేస్తావా అని అంటాడు చక్రపాణి. నిన్ను చంపేస్తాను అనడంతో నేను చచ్చి నీ కూతురు చచ్చిపోతే నీ మనవడు అనాధ అవుతాడు అనగా ఆ చంటి పిల్లవాడు నీకు ప్రాణ బిక్ష పెట్టాడు అనుకో అనడంతో రాజీవ్ నవ్వుతూ ఉంటాడు.
 

నా మనవడి మొఖం చూసి నిన్ను వదిలిపెట్టాను అని అంటాడు. చక్రపాణి కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు రాజీవ్ వసునీ ఎలా అయినా నేను దక్కించుకుంటాను మా మామయ్య తాటాకు చప్పుల్లకు నేను భయపడను అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు రిషి పుష్ప తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పుష్ప వసుధార కోసం క్యారేజీ తీసుకుని వచ్చి మీరు ఏమీ అనుకోకుండా ఇది వసుధారకి ఇస్తారా సార్ అని అంటుంది. అప్పుడు రిషి ఆ క్యారీ తీసుకుని సరే అని అంటాడు. హస్బెండ్ చాలా అదృష్టవంతుడు వసుధార లాంటి భార్య దొరికినందుకు వసుధార వాళ్ళ నాన్న వస్తున్నాడు సార్ వాళ్ళ కోసం ఇల్లు చూస్తున్నాను అని చెప్పి పుష్ప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది.

అప్పుడు రిషి ప్రాజెక్టుకి హెడ్ వసుధార గారు వచ్చారు నన్ను కలిశారు అనడంతో రిషి కూల్ గా ఉన్నాడా లేదంటే కూల్ గా ఉన్నట్లు నటిస్తున్నాడా అనుకుంటూ ఉంటుంది జగతి. అప్పుడు రిషి తాళాలు ఇచ్చి ఇది ప్రాజెక్టు హెడ్ కి ఇవ్వండి. గౌతమ్ ఫ్లాట్ కి వెళ్ళమని చెప్పండి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా వసుధారకి బాధ్యతలు కల్పించాల్సిన బాధ్యత మనదే. నీకు తనమీద కోపం లేదా అనగా ఎవరికోపాలకు ఎవరిని బాధ్యులను చేస్తాం మేడమ్. తొందరగా ప్రాజెక్ట్ హెడ్ గారిని గౌతమ్ ప్లాట్ లోకి షిఫ్ట్ అవ్వమని చెప్పండి అని అంటాడు. నాకు పుష్ప క్యారీ తీసుకుని వచ్చింది ఇది కూడా ప్రాజెక్టు హెడ్ కీ ఇవ్వమని చెప్పింది తనకు ఇవ్వండి అని అంటాడు.
 

మరొకవైపు వసుధార ఒకచోట కూర్చుని తప్పుగా మాట్లాడి అందరి మనసులను నొప్పించాను కానీ నాకు మాట్లాడే అవకాశం ఇస్తేనే కదా నేను వాళ్లకు నచ్చ చెప్పేది అనుకుంటూ ఉండగా ఇంతలోనే జగతి అక్కడికి వస్తుంది. అప్పుడు ఏంటి మేడం అలా చూస్తున్నారు అనగా ఏమి లేదు వసుధార మేడం గారు అని అంటుంది జగతి. గొప్ప పనులు చేసిన వారిని గొప్ప స్థానంలో ఉన్న వారిని మర్యాదగా పెట్టి పిలవడంలో తప్పులేదు కదా అని అంటుంది. మేడం ఎందుకు నన్ను మీరు ఇట్లా చిత్రవధ అనగా శటాప్ ఎవరు ఎవరిని చిత్రవధ చేశారో మీకు తెలియదా అని సీరియస్ అవుతుంది జగతి. నేను చెప్పేది వినండి మేడం అనడంతో నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం మాకు లేదు ప్రాజెక్ట్ గా ఏదైనా చూపు వింటాను అని అంటుంది జగతి.

మిషన్ ప్రాజెక్టు హెడ్గా మీకు ఒక రూమ్ ఇవ్వాలి కాబట్టి రిషి సార్ మీకు ఇవ్వమని చెప్పారు అనడంతో ఆ కీస్ ని తీసుకొని, రిషి సార్ నాకు ఇవ్వమని చెప్పారా మేడం అని సంతోష పడుతూ ఉంటుంది వసుధార. తర్వాత జగతి క్యారేజ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వసుధార బాధపడుతూ జరిగింది చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు అని బాధపడుతూ రిసి ఇచ్చిన కిస్ ని చూసి సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత నేనొకటి అనుకుంటే మరొకటి జరిగింది ప్లాన్ మొత్తం తలకిందులు అయ్యింది అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవయాని. రిషి వెనక్కి వచ్చాడు ఆ వసుధార కూడా వచ్చింది వీళ్లిద్దరు మళ్ళీ ఒకటి అవుతారా అని అనుకుంటూ రాజీవ్ కి ఫోన్ చేస్తుంది.
 

నమస్తే మేడం జి అనడంతో, రేయ్ ఎక్కడ చచ్చావ్ రా అనడంతో, రానా రా ఏంటి రా నా పేరులో మొదటి అక్షరం రా కావచ్చు ఏమో కానీ విడిగా రా అంటే బాగోదు అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీ మీద కొంచెం మర్యాద ఉంది అది అలాగే ఉండనివ్వండి అసలే మంట మీద ఉన్నాను అనడంతో అంతకంటే ఎక్కువ మంట మీద ఉన్నాను అంటుంది దేవయాని. డబ్బులు ఇచ్చి అవకాశం ఇచ్చాను కానీ చెప్పిన పని చేయకుండా చేతకాని దద్దమ్మల తప్పించుకొని తిరుగుతున్నావు అనడంతో రాజీవ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

click me!