మళ్ళీ న్యూడ్ క్లిప్స్ వైరల్.. హీరోయిన్ పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్, ప్రభుత్వానికి డిమాండ్

First Published Aug 13, 2021, 8:04 PM IST

ఇక రాధికా ఆప్టే తరచుగా వివాదాల్లో ఉండే నటి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆమె పేరు నానుతూ ఉంటుంది. నెటిజన్ల నుంచి ట్రోలింగ్ దుర్కొంటూ ఉంటుంది.

బాలీవుడ్ ఎప్పుడూ వివాదాల్లో మునిగితేలుతూ ఉంటుంది. బాలీవుడ్ ఇండియాలో ఒక మాఫియాలా తయారవుతోందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. వ్యక్తిగతంగా కూడా కొందరు నటులు, నటీమణులు, బాలీవుడ్ తో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా వ్యవహారం చూస్తూనే ఉన్నాం. 

ఇక రాధికా ఆప్టే తరచుగా వివాదాల్లో ఉండే నటి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆమె పేరు నానుతూ ఉంటుంది. నెటిజన్ల నుంచి ట్రోలింగ్ దుర్కొంటూ ఉంటుంది. రాధికా ఆప్టే చాలా ఏళ్లుగా న్యూడ్ క్లిప్స్, ఇంటిమేట్ సన్నివేశాల విషయంలో విమర్శలు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే. 

కొన్నేళ్ల క్రితం రాధికా ఆప్టే పార్చ్డ్ అనే అడల్ట్ మూవీలో నటించింది. ఆ చిత్రంలో రాధికా ఆప్టే పూర్తి నగ్నంగా నటించింది. ఆ దృశ్యాలు నెట్ లో వైరల్ అయ్యాయి కూడా. అప్పట్లో రాధికా ఆప్టే ఈ చిత్రంలో నటించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 

ఇటీవల రాధికా ఆప్టే అలాంటి చిత్రాల్లో నటించడం పట్ల తనని తాను సమర్ధించుకుంది. మహిళల స్వేచ్ఛ కోణంలో రీసెంట్ గా కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం నుంచి ట్విటర్ లో ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్ మొదలయింది. 

అందుకు కారణం పార్చ్డ్ చిత్రంలోని వీడియోలు, రాధికా ఆప్టే న్యూడ్ పిక్స్ వైరల్ కావడమే. దీనితో నెటిజన్లు కామెంట్స్ పెడుతూ రాధికా ఆప్టేని తిట్టిపోస్తున్నారు. ఆమె నటిస్తున్న చిత్రాలు భారతీయ సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని, ఆమెని బాయ్ కాట్ చేయాలనీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

న్యూడ్ సన్నివేశాల్లో నటించడం తనకు కంఫర్టబుల్ గా ఉంటుందని రాధికా చేసిన వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు. ఆమె యాంటీ హిందూ. రాధికా ఆప్టే ఇండియన్ కల్చర్ కు వ్యతిరేకం. ఆమెని బాయ్ కాట్ చేయండి అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 

click me!