బాలీవుడ్ కి 2022 బ్లాక్ ఇయర్ అని చెప్పాలి. వాళ్లకు అసలు కలిసి రాలేదు. టాప్ స్టార్స్ నుండి టైర్ టు హీరోల వరకూ ఎవరికీ విజయం దక్కలేదు. ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే అన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో సౌత్ చిత్రాలు బాలీవుడ్ దుమ్ముదులిపాయి. ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2, కార్తికేయ , కాంతార సాలిడ్ వసూళ్లు సాధించాయి. దీంతో తమ ఓన్ రెసిపీ పక్కనపెట్టి సౌత్ కథలు ట్రై చేస్తున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, కార్తీక్ ఆర్యన్ రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు.