ఆడవారు సెక్స్ కోసం మాత్రమే కాదు.. కంగనా రనౌత్ ఫైర్, సుబ్రహ్మణ్యస్వామికి కౌంటర్

Mahesh Jujjuri | Published : Oct 27, 2023 12:30 PM
Google News Follow Us

బిజేపి ఎంపీ సుప్రహ్మణ్యస్వామిపై ఫైర్ అయ్యారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తాను బికినీ వేస్తే మీకేంటి ప్రాబ్లమ్ అంటూ మండిపడ్డారు. ఇంతకీ ఈ వివాదం ఎక్కడ ఎలా స్టార్ట్అయ్యింది. 
 

16
ఆడవారు సెక్స్ కోసం మాత్రమే కాదు.. కంగనా రనౌత్ ఫైర్,  సుబ్రహ్మణ్యస్వామికి కౌంటర్

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతోంది కంగనా రనౌత్. ఎవరితో సబంధం లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతోంది .బాలీవుడో నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ లాంటివాటిపై గట్టిగా పోరాటం చేస్తోంది కంగనా. దాంతో బాలీవుడ్అంతా ఒక్కటై.. ఆమోను వేరు చేసినా.. ఆమె మాత్రం ఒంటరి పోరాటం చేస్తోంది. 
 

26

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కంగనా మార్క్ వేరే విధంగా ఉంటుంది. ప్రతీ వివాదం విషయంలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన వర్షన్ ను క్లియర్ గా వెల్లడిస్తుంది కంగనా. దాంతో ఆమో చేసే వాఖ్యలు మరింత వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా మరో కాంట్రవర్సీలో హైలెట్ అయ్యారు కంగనా రనౌత్. విషయం ఏంటంటే..?
 

36
Kangana Ranaut in Ramleela Maidan

ఈమధ్యకంగనాకు అరుదైన అవకాశం వచ్చింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిదిగా అతిథిగా హాజరయింది. రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగన రికార్డ్  సృష్టించింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ గతంలో కంగన బికినీ వేసుకున్న ఫోటోను శేర్ చేయడంతో పాటు... మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న లేడీ అంటూ కామెంట్ చేసింది. 
 

Related Articles

46

ఈ ట్వీట్ పై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ కంగనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కంగనను రావణ దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే ఆమెకు ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కంగన కోసం ఎస్పీజీ కాస్త ఎక్కువగానే స్పందిస్తోందని అన్నారు. ఇది ఒక గౌరవం లేని సంస్థ అని విమర్శించారు. దాంతో కంగనాకు చిర్రెత్తుకొచ్చింది. 

56

ఇక ఈ వాఖ్యలపై స్పందించింది కంగనా రనౌత్. ఒక రకంగా ఫైర్ అయింది. తనశరీరాన్ని ఉపయోగించుకునే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు అనుకుంటున్నారని ఆమె మండిపడింది. తన స్విమ్ సూట్ ఫొటో గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే... ఆయన స్వభావం ఏమిటో అర్థమవుతోందని అన్నారు. మహిళల విషయంలో ఆయన వక్రబుద్ధి అర్థమవుతోందని దుయ్యబట్టారు. 

66

తన స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలా మాట్లాడేవారా? అని ప్రశ్నించారు. స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదని... వారికి కూడా మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి అవయవాలు కూడా ఉన్నాయని చెప్పారు. పురుషుడి మాదిరే గొప్ప నేతగా ఎదగడానికి అవసరమైన అన్ని అర్హతలు మహిళలకు ఉన్నాయని అన్నారు. దాంతో ఈ వ్యాక్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 

Read more Photos on
Recommended Photos