ట్రెండీ వేర్‌లో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా.. ఘాటైన అందాలు దాస్తే దాగునా..

First Published Aug 20, 2021, 3:28 PM IST

ట్రెండీ వేర్‌లో బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా పిచ్చెక్కిస్తుంది. రెడ్‌ టాప్‌, ప్యాంట్‌లో పరువాలు పోయింది. పలుచని జాకెట్‌తో నడుమందాలను దాస్తూ ఈ అమ్మడు చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం అరియానా పంచుకున్న హాట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

`బిగ్‌బాస్‌4` సంచలనం అరియానా గ్లోరీ. బోల్డ్ అండ్‌ బ్యూటీఫుల్‌కి నిదర్శనమని చెప్పొచ్చు. తను బిగ్‌బాస్‌లోకి రావడమేకాదు, హౌజ్‌లో ఉన్నన్ని రోజులు బోల్డ్ గా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఇప్పుడు హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక కూడా అంతే బోల్డ్ నెస్‌గా వ్యవహరిస్తుంది. ఓ వైపు టీవీ షోస్‌లోనూ సందడి చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోల పరంగానూ బోల్డ్ అని నిరూపించుకుంటుంది.

తన హాట్‌ హాట్‌ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటోంది. వారిని ఖుషీ చేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. వరుసగా ఈ అమ్మడు పంచుకునే గ్లామర్‌ ఫోటోలకు లక్షలాది మంది నెటిజన్లు వెయిట్‌ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 

అరియానా ఏం చేసినా స్పెషల్‌గానే ఉంటుంది. ఫోటోలకు పోజులిచ్చినా అదే స్పెషలే. ట్రెండ్‌ వేర్‌లో ఈ సన్నజాజి అందాలభామ ఇచ్చే పోజులు మతిపోగొడుతుంటాయంటే అతిశయోక్తి కాదు.

అరియానా తనకు మరింతగా పాపులారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది.ఇటీవల వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో చేసిన ఇంటర్వ్యూనే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. 

ఇందులో వర్మ.. అరియానాని బోల్డ్ యాంగిల్స్ లో కెమెరా ఫోకస్‌ పెట్టించి మరీ ఈ ఇంటర్వ్యూ చేయించడం విశేషం. ఇది వైరల్‌గా మారడమే కాదు, సంచలనంగా మారింది. 
 

అరియానా ఇలా తెగించేందేంటి? అంటూ నెటిజన్లు,ఆమె ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఆమెని ట్రోల్స్ చేశారు. వర్మతో వర్కౌట్‌ సెషన్‌లో దిగిన ఫోటోలు మరింత వివాదంగా మారాయి. 

అయితే దీనిపై అరియానా ఆచితూచి స్పందించింది. తాను దాన్ని తప్పుగా భావించడం లేదని, అదొక స్టయిల్‌ అని తెలిపింది. వర్మతో ఇంటర్వ్యూ అన్నప్పుడే తాను ఇలాంటి అన్నింటికి ప్రిపేర్‌ అయి వెళ్లానని తెలిపింది. 

అంటే వర్మ ఏంటో తెలిసే అరియానా ఈ పని చేసిందని చెప్పొచ్చు. అయితే హద్దులు మీరలేదని పేర్కొంది. తనకు లైఫ్‌ ఇచ్చిన వర్మకిది ఒక గ్రాటిట్యూడ్‌గా తాను భావిస్తున్నట్టు తెలిపింది అరియానా. 
 

మొత్తం ఈ ఎపిసోడ్‌లో వర్మ కంటే తానే ఎక్కువగా పబ్లిసిటీ కొట్టేసింది అరియానా. అప్పటి నుంచి ఏదో రకంగా అరియానా నెట్టింట్ట సందడి చేస్తూనే ఉంది.

మరోవైపు ఇప్పుడు సినిమా అవకాశాల కోసం వెతుకులాటలో బిజీగా ఉంది అరియానా. పలు షర్ట్ ఫిల్మ్స్,వెబ్‌ సిరీస్‌ల నుంచి సినిమాల వరకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. త్వరలోనే అరియానా బిజీ నటిగా మారబోతుందని చెప్పొచ్చు. 

click me!