బిగ్‌బాస్‌5ః `జబర్దస్త్` టాప్‌ కమెడీయన్‌కి రూ.2.5కోట్ల ఆఫర్‌?.. షణ్ముఖ్‌ హౌజ్‌లోకి రావట్లేదా?

First Published Aug 11, 2021, 1:27 PM IST

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి షురూ కాబోతుంది. వచ్చే నెల ఫస్ట్ వీక్‌లోనే ఇది ప్రారంభం కాబోతుందని సమాచారం. కానీ కంటెస్టెంట్ల విషయంలో ఇంకా గందరగోళం కనిపిస్తుంది. ఎవరు హౌజ్‌లోకి వెళ్తున్నారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. 

బిగ్‌బాస్‌5లోకి క్రేజీ కంటెస్టెంట్లని దించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా `జబ్దర్దస్ట్` టాప్‌ కమెడీయన్‌, బుల్లితెర స్టార్‌ సుడిగాలి సుధీర్‌ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు భారీ పారితోషికం ఆఫర్‌ చేశారట. భారీ అంటే అది కనీ వినీ ఎరుగనంత కావడం విశేషం. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. 

సుడిగాలి సుధీర్‌కి `బిగ్‌బాస్‌5` నిర్వహకులు రోజుకి రెండు లక్షలు అంటే ఆయన షో మొత్తంఉంటే వంద రోజులు ఉంటే అక్షరాల రెండు కోట్లు ఇవ్వాలని, టైటిల్‌ విన్‌ అయితే ప్రైజ్‌మనీ రూ.50లక్షలు కలిపి రెండున్నర కోట్లు పారితోషికంని ఆఫర్‌ చేసినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. 

టీవీలో సుడిగాలి సుధీర్‌ అంటే ఓ క్రేజీ స్టార్‌. `జబర్దస్త్` షోల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ మరెవరికీ లేదు. ఆయన స్కిట్లు సైతం విపరీతంగా రేటింగ్‌ని పొందుతుంటాయి. అదే సమయంలో యాంకర్‌ రష్మితో ఆయన ప్రేమ వ్యవహారం సైతం షోని రక్తికట్టించేలా చేస్తుంటుంది. దీంతోపాటు `ఢీ` షోలో, అలాగే `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `రెచ్చపోదాం బ్రదర్స్` షోలోనూ మెరుస్తున్నాడు సుధీర్‌. 

ఇదే కాకుండా హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వీటన్నింటిని పక్కన పెట్టి రావాలంటే మామూలు విషయం కాదు, మొదట ఆయన నో చెప్పారనే టాక్‌ వినిపిస్తుంది. కానీ బిగ్‌బాస్‌ 5 నిర్వహకులు భారీగా ఆఫర్‌ చేయడంతో ఆలోచనలో పడ్డారట. మరి ఆయన నిజంగానే హౌజ్‌లోకి వస్తారా అనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. 
 

మరోవైపు బిగ్‌బాస్‌5లోకి యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ రాబోతున్నట్టు ఆయనకు కోటీ రూపాయలు పారితోషికం ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన దీనిపై పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. `నెగిటివ్‌ కామెంట్లు నాకు కొత్త కాదు. రాసే వాళ్లను రాయనివ్వండి. నేను చెప్పేవరకు వేటినీ నమ్మకండి` పంచుకున్న పోస్ట్ వైరల్‌ అవుతుంది. దీంతో ఆయన బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వస్తున్నారనే వార్తలు నిజం కాదనే టాక్‌ వినిపిస్తుంది. 
 

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌5లో యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ గెటప్ శ్రీను, వర్ష రఘు మాస్టర్, సింగర్ మంగ్లీ, న్యూస్ యంకర్ రోజా, నటి సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు ఉన్నారని టాక్. ఈ ఐదో సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నారు.
 

click me!