Bigg Boss Telugu 6: బిగ్ బాస్ బ్యూటీ నేహా చౌదరి వివాహం... పెళ్లి పందిరిలో కంటెస్టెంట్స్ సందడి 

Published : Dec 19, 2022, 01:24 PM ISTUpdated : Dec 19, 2022, 01:27 PM IST

నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కారు. ఆమె వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
16
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ బ్యూటీ నేహా చౌదరి వివాహం... పెళ్లి పందిరిలో కంటెస్టెంట్స్ సందడి 
Bigg Boss Telugu 6

మోడల్, నటి నేహా చౌదరి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అంచనాల మధ్య అడుగుపెట్టిన నేహా చౌదరి నిరాశపరిచాడు. కేవలం మూడు వారాలకే ఆమె గేమ్ ముగిసింది. నేహా తన గేమ్, టాలెంట్ నిరూపించుకునే లోపే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. 
 

26
Bigg Boss Telugu 6


రెండు మూడు వారాల్లో ఎలిమినేట్ అయినోళ్లది బాడ్ లక్ అని చెప్పాలి. కారణం... వాళ్లకు గేమ్ అర్థం కాకముందే బయటకు వచ్చేస్తారు. కొంచెం లక్ ఉన్న కంటెస్టెంట్స్ ఫస్ట్ డేస్ లో సర్వైవ్ అవుతారు. మెల్లగా పరిస్థితులు అర్థం చేసుకొని టైటిల్ రేసులోకి వస్తారు. 
 

36
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని నేహా చౌదరి లాంచింగ్ ఎపిసోడ్ లో చెప్పారు. పెళ్లి తప్పించుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళుతున్నావట కదా? అని నాగార్జున నేహా చౌదరిని అడిగారు. అవునని సమాధానం చెప్పిన నేహా చౌదరి... పెళ్లి చేసుకున్నాక హౌస్ కి వచ్చినా గేమ్ ఆడలేము. మనలా మనం ఉండలేము. అందుకే బిగ్ బాస్ షో అనుభవం చూసి, తర్వాత వివాహం చేసుకుంటానని నేహా చెప్పారు. 
 

46
Bigg Boss Telugu 6


చెప్పినట్లే మూడు నెలల్లో నేహా పెళ్లికి సిద్ధమయ్యారు. బిగ్ బాస్ ఫినాలే షూట్ జరుగుతున్న సమయంలోనే నేహా చౌదరి వివాహం జరగడం విశేషం. దీంతో సీజన్ 6 కంటెస్టెంట్స్ అందరూ దాదాపుగా నేహా చౌదరి వివాహానికి హాజరయ్యారు. పెళ్లిలో సందడి చేశారు. 
 

56

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రాకతో పెళ్లి వేడుక మరింత శోభ సంతరించుకుంది. వారిని చూసేందుకు బంధువులు, సన్నిహితులు ఎగబడ్డారు. తమ అభిమాన కంటెస్టెంట్స్ తో ఫోటోలు కూడా దిగారని సమాచారం. అలా నేహా చౌదరి వివాహ బంధంలో అడుగుపెట్టారు. 
 

66
Bigg Boss Telugu 6


కాగా ఆదివారం ముగిసిన బిగ్ బాస్ ఫినాలేలో రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా అవతరించాడు. రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు. టైటిల్ కోసం రేవంత్, శ్రీహాన్ మధ్య పోటీ నెలకొంది. నాగార్జున విన్నర్ ని ప్రకటించే ముందు రూ. 40 లక్షలు ఆఫర్ చేశారు. తీసుకొని రేసు నుండి తప్పుకోవచ్చని చెప్పారు. శ్రీహాన్ డబ్బులు తీసుకోవడంతో రేవంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. 

Read more Photos on
click me!

Recommended Stories