బిగ్ బాస్ రేంజ్ లో ఈటీవీ షో... హైపర్ ఆది ఫోటోలను చింపి కాల్చేసిన రష్మీ, ఆటో రామ్ ప్రసాద్ 

Published : Aug 11, 2022, 06:27 PM IST

కలిసి నవ్వులు కురిపించే రష్మీ గౌతమ్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది మధ్య కూడా ఇగోలు, మనస్పర్థలు ఉంటాయని తేలిపోయింది. మనసు లోతుల్లో ఒకరిపై ఒకరికి కోపం ఉందని బయటపడింది. బిగ్ బాస్ షోని తలపించిన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

PREV
16
బిగ్ బాస్ రేంజ్ లో ఈటీవీ షో... హైపర్ ఆది ఫోటోలను చింపి కాల్చేసిన రష్మీ, ఆటో రామ్ ప్రసాద్ 
Sridevi Drama company

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama company) కాస్తా బిగ్ బాస్ హౌస్ లా తయారైంది. ఆద్యంతం కామెడీగా సాగిన షో చివర్లో సీరియస్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే... ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీకి అతిథులుగా తీస్ మార్ ఖాన్ హీరో హీరోయిన్ ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్  వచ్చారు. అలాగే హీరోయిన్ పూర్ణ సైతం షోలో సందడి చేశారు. 
 

26
Sridevi Drama company

ఎప్పటిలాగే కామెడీ స్కిట్స్, అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ లతో శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచింది. చివర్లో యాంకర్ రష్మీ(Rashmi Gautam).. ఓ టాస్క్ నిర్వహించారు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ , బుల్లెట్ భాస్కర్, రష్మీ, పూర్ణ ఫొటోలతో పాటు షోలో ఉన్న మరికొందరు ఫోటోలు ఆమె తెప్పించారు. టాస్క్ లో భాగంగా తమకు నచ్చని ఓ వ్యక్తి ఫోటో కాల్చి వేయవచ్చు, అని ఆమె చెప్పారు. 
 

36
Sridevi Drama company

మొదట ఆటో రామ్ ప్రసాద్(Auto Ramprasad) వచ్చాడు. ఆయన హైపర్ ఆది ఫోటో కాల్చివేశాడు. సారీ ఆది ఓ సందర్భంలో పర్సనల్ గా హర్ట్ చేశావ్, అందుకే నీ ఫోటో కాల్చేశానని అన్నాడు. అనంతరం మరో కమెడియన్ కూడా హైపర్ ఆది తనను హర్ట్ చేసినందుకు ఫోటో చించేస్తున్నా అన్నాడు. 
 

46
Sridevi Drama company

వీరిద్దరి తర్వాత రష్మీ సైతం హైపర్ ఆది తనకు ఓ సందర్భంలో నచ్చలేదని అతడి ఫోటో చించేసింది. ఈ షోకి యాంకర్ గా వచ్చినప్పుడు ఎన్నాళ్ళు ఉంటావ్ అని కాకుండా ఎప్పుడు వెళ్ళిపోతావ్ అని అడిగాడు, నేను హర్ట్ అయ్యానని రష్మీ కారణం చెప్పింది. తన తోటి కమెడియన్స్, యాంకర్స్ ఫోటో చించేస్తుంటే, హర్ట్ చేశాడని ఆరోపణలు చేస్తుంటే హైపర్ ఆది ముఖం చిన్నబోయింది. 
 

56
Sridevi Drama company

అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. హైపర్ ఆది(Hyper Aadi) ముఖం చూస్తే.. రోజూ నాతో షోస్ చేస్తూ నవ్వించే వాళ్ళ మనస్సులో నాపై ఇంత కోపం ఉందా అన్నట్లుగా ఉంది. ఇక హైపర్ ఆదికి కూడా ఛాన్స్ వచ్చింది. అక్కడ ఉన్న ఫొటోల్లో నచ్చని వ్యక్తి ఫోటో చించేయవచ్చని రష్మీ చెప్పింది. హైపర్ ఆది ఎవరి ఫోటో చించాడు అనేది సస్పెన్సు.. 
 

66
Sridevi Drama company


శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ఇలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో ఈ తరహా గేమ్స్ చూస్తాము. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో హౌస్ లో తమకు నచ్చని వారి ఫోటోలు కాల్చేయడం, చించేయడం వంటి టాస్క్స్ ఉంటాయి. అనూహ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ సీరియస్ గేమ్ ఇంట్రడ్యూస్ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories