ఈ రాశివారితో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఇదే..!

First Published | Apr 27, 2024, 4:00 PM IST

కొందరికి ఉండే కొన్ని అలవాట్లు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ రాశివారిలో  ఉండే  ఏ క్వాలిటీ ఇతరులను ఇబ్బంది పెడుతుందో చూద్దాం..
 


ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే.. కొందరికి ఉండే కొన్ని అలవాట్లు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ రాశివారిలో  ఉండే  ఏ క్వాలిటీ ఇతరులను ఇబ్బంది పెడుతుందో చూద్దాం..

telugu astrology

1.వృశ్చిక రాశి, మకర రాశి..

వృశ్చిక రాశి, మకర రాశివారు తో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే.. ఈ రాశుల వారికి అంత తొందరగా నమ్మలేం. ఈ రాశులవారిని నమ్మితే నట్టేట మునిగిపోవడమే. వీరు ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారో అస్సలు ఊహించలేం. వీరిని నమ్ముకొని జీవితంలోకి అడుగుపెడితే.. చాలా ఈజీగా మోసం చేయగలరు. ఈ రెండు రాశులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.
 


telugu astrology

2.మీన రాశి, ధనస్సు రాశి, కన్య రాశి..
ఇక, మీన రాశి, ధనస్సు రాశి, కన్య రాశి వారితో వచ్చిన చిక్కేంటి అంటే... వీరికి ఆత్రుత ఎక్కువ. ఏ విషయంలో అయినా తొందర ఎక్కువ. ఎదుటివాళ్లు చెప్పేది కూడా మొత్తం విని అర్థం చేసుకోరు.

telugu astrology

3. కర్కాటక రాశి, తుల రాశి..
కర్కాటక రాశి, తుల రాశి ఈ రెండు రాశులతో వచ్చిన చిక్కు ఏమిటంటే... ఈ రాశులవారికి అభద్రతా భావం ఎక్కువ. ప్రతి విషయంలోనూ భయపడుతూనే ఉంటారు. ముఖ్యంగా లైఫ్ పార్ట్ నర్ విషయంలో వీరికి ఈ ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది.

telugu astrology


4.కుంభ రాశి, వృషభ రాశి..
ఈ రెండు రాశులతో వచ్చిన చిక్కు ఏమిటంటే... ఈ రాశులవారు చాలా బండ రాయిల్లా ప్రవర్తిస్తారు. వారు ప్రేమ, బాధ దేనినీ బయటపెట్టరు.  తమ గుండెల్లో మోయలేనంత బాధ ఉన్నా.. ఈ రాశివారు భరిస్తారే తప్ప బయటపెట్టరు.

telugu astrology

5. మేష రాశి, సింహ రాశి, మిథున రాశి..
ఇక మేష , సింహ, మిథున రాశులతో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే... ఈ రాశివారు అటెన్షన్ సీకర్స్. ఎక్కడ ఉన్నా... అందరూ తమను గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటారు.

Latest Videos

click me!