అక్షయ తృతీయ రోజును హిందూ మతంలో ఎంతో ప్రత్యేకమైందిగా భావిస్తారు. అక్షయ తృతీయను కూడా దీపావళి, ధనత్రయోదశి మాదిరిగానే ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు శుభానికి చిహ్నం. ఈ రోజు సంపద దేవత అయిన లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని నిష్టగా పూజిస్తారు. ఈ ఏడాది ఈ పండుగ మే 10 న వచ్చింది. ఈ రోజున లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పేదలకు దానధర్మాలు చేస్తారు. అలాగే షాపింగ్ కూడా చేస్తారు. దీనివల్ల మన కోరికలన్నీ తీరుతాయనే నమ్మకం ఉంది.
అక్షయ తృతీయ
ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగను మే 10న జరుపుకోనున్నాం. ఈ రోజున రోహిణి నక్షత్రం ఉదయం నుంచి 10.54 గంటల వరకు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజున చాలా మంది షాపింగ్ ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మీరు ఈ రోజు షాపింగ్ కు వెళ్లాలనుకుంటే రోహిణి నక్షత్రం సమయంలో మాత్రమే వెళ్లండి. ఎందుకంటే ఈ సమయం చాలా మంచిదని భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజంతా శుభప్రదంగానే ఉంది.
akshaya tritiya
బంగారం, వెండితో వీటిని కొనొచ్చు
అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారం, వెండిని బాగా కొంటుంటారు. అయితే మీరు వీటితో పాటుగా భూమి, ఇల్లు, వాహనం వంటి వాటిని కూడా కొనొచ్చు. అక్షయ తృతీయ నాడు వీటిని కొనుగోలు చేసిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెప్తారు. అంతేకాదు దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.
మీకు అవసరం లేకపోయినా, మీ బడ్జెట్ లో మీరు ఇంట్లోకి వస్తువులను కూడా కొనొచ్చు. దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే దేవుడి కోసం మీరు చేసే ప్రతి ఒక్కటీ మీపై అనుగ్రహం పొందేలా చేస్తాయి.