బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Apr 27, 2024, 4:46 PM IST


ఏ కొంతమందో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ లాంటివి తింటుంటారు. కానీ చాలా మంది మాత్రం ఉదయం అన్నాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తింటుంటారు. మరి ఉదయాన్నే అన్నం తింటే ఏమౌతుందో తెలుసా?
 


మనలో చాలా మంది రెగ్యులర్ గా ఉదయం అన్నమే తింటుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. కానీ కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Cooked rice

చురుకు

బియ్యంలోని కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు ఒక రోజుకు అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతాయి. కానీ మీరు అన్నాన్ని మరీ ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు మీరు బరువు పెరిగేలా చేస్తాయి.

జీర్ణం

అన్నంలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది ప్రయోజరకరంగా ఉంటుంది. ఉదయం అన్నాన్ని తింటే మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. 

బరువు తగ్గడం

అన్నంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నం చాలా సులువుగా జీర్ణమవుతుంది. అలాగే మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రోజూ ఉదయం లిమిట్ లో అన్నం తినండి. 

rice

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బియ్యం విటమిన్ డి, పొటాషియం,  మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతో పాటుగా మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.

గుండె జబ్బులను నివారిస్తుంది

అన్నం తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నం తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

యాంటీఆక్సిడెంట్లు

బియ్యం యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కణాలను, డీఎన్ఎను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి మీ శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం తగ్గుతుంది. 

click me!