నేను,అఖిల్ ఒక్కటనుకుంటే పొరపాటే.. అఖిల్ కి హ్యాండ్ ఇచ్చిన మోనాల్!

First Published Jan 16, 2021, 2:50 PM IST


బిగ్ బాస్ షో మోనాల్ జీవితంలో వెలుగులు తెచ్చిందని చెప్పాలి.  రెండు తెలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆమె షో ద్వారా తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మోనాల్ పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు. 
 

మోనాల్ కి వచ్చిన పాపులారిటీ రీత్యా ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయని సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ మూవీలో మోనాల్ ఐటెం నంబర్ చేశారు.
undefined
ఇక మా టీవీలో కొత్తగా ప్రారంభమైన డాన్స్ ప్లస్ రియాలిటీ షోకి జడ్జ్ గా మోనాల్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
undefined
మోనాల్ హిందీలో చేసిన కాగజ్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరి గృహిణిగా మోనాల్ నటనకు ప్రసంశలు దక్కుతున్నాయి.
undefined
ఈ నేపథ్యంలో వరుస ఆఫర్స్ తో తాను బిజీగా ఉన్నట్లు మోనాల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు పని చేయడం ఇష్టమని,  తీరిక లేకుండా గడపడం బాగుందని ఆమె అన్నారు.
undefined
ఐతే కనిపించిన ప్రతి చోటా తనను అఖిల్ ఎక్కడ అని అడుగుతున్నారని మోనాల్ అన్నారు. బిగ్ బాస్ షో తరువాత అఖిల్, నేను ఎప్పుడూ కలిసి ఉంటామని అందరూ అనుకుంటున్నారని మోనాల్ అన్నారు.
undefined
హౌస్ నుండి బయటికి వచ్చాక అఖిల్ ని కేవలం మూడు సార్లు మాత్రమే కలిశానని మోనాల్ వెల్లడించారు. నేను, అఖిల్ ఒక్కటే అనుకుంటే పొరపాటే అని బాంబ్ పేల్చారు. అఖిల్ తో పాటు లాస్య, సోహెల్, అభిజీత్ లను కలవడం జరిగింది అన్నారు.
undefined
అఖిల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. అన్నివేళలా నాదగ్గర ఉండడని మోనాల్ చెప్పడం విశేషత సంతరించుకుంది.  హౌస్ లో ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఈ జంట, బయట ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారని అర్థం అవుతుంది.
undefined
ఈ తతంగం అంతా చూస్తుంటే.. మోనాల్- అఖిల్ ప్రేమ బిగ్ బాస్ హౌస్ వరకే అని అనిపిస్తుంది. అఖిల్, మోనాల్ ప్రేమ, పెళ్లి అంతా వట్టిమాటలే అని అర్థం చేసుకోవచ్చు.
undefined
గతంలో కూడా బిగ్ బాస్ హౌస్ లో మొదలైన ప్రేమ కథలు పెళ్లి అనే తీరం చేరలేదు. ఇక అఖిల్-మోనాల్ ప్రేమ కథ కూడా అలాంటిదే అని భావించవచ్చు.
undefined
click me!