మోనాల్ మనసు గెలుచుకున్న యాంకర్ ఓంకార్... ఆయన ఇచ్చిన గిఫ్ట్ కి మురిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ!

First Published May 24, 2021, 3:37 PM IST


బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో బాగా లాభపడిన వారెవరంటే టక్కున మోనాల్ గజ్జర్ పేరు చెప్పేస్తారు. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేక ఆఫర్స్  రాక అల్లాడుతున్న తరుణంలో రిస్క్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది మోనాల్. 
 

హౌస్ లోకి ఎంటరైన మొదటి రోజు నుండే నిర్వాహకులు తనకు ఇచ్చిన బాధ్యత తూచా తప్పకుండా పాటించింది మోనాల్. పొట్టి డ్రెస్ లు వేసుకొని, ప్రేమ కథలు నడిపింది. మోనాల్ డ్రెస్ సెన్స్, యాటిట్యూడ్ బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు. దీనితో ఆమె త్వరగానే ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు.
undefined
హౌస్ లో అఖిల్ సార్థక్, అభిజిత్ తో దాగుడుమూతల ప్రేమ కథ నడిపింది మోనాల్. మొదట్లో ఆమె ఎవరికి కనెక్ట్ అవుతుందో అర్థం కాక ప్రేక్షకులు జుట్టు పీకున్నారు. అయితే చివరికి తన ప్రేమను అఖిల్ కి అంకితం చేసి, అభిజీత్ కి హ్యాండ్ ఇచ్చింది.
undefined
దాదాపు 14వారాలు ఇంట్లో ఉన్న మోనాల్ పారితోషికం రూపంలో గట్టిగానే అందుకున్నారని తెలిసింది. బిగ్ బాస్ షో వలన వచ్చిన ఫేమ్ ఆమెకు స్పెషల్ సాంగ్ లో నటించే ఆఫర్ తో పాటు బుల్లితెర షో జడ్జిగా ఉండే అవకాశాలు తెచ్చిపెట్టింది.
undefined
కాగా స్టార్ మాలో ప్రసారం అయిన డాన్స్ ప్లస్ షో కి ఆమె జడ్జిగా వ్యవహరించారు. ఈ షో ముగిసిన నేపథ్యంలో యాంకర్ గా ఉన్న ఓంకార్ మోనాల్ కి అరుదైన గిఫ్ట్ ఇచ్చి ఆమె మనసు దోచుకున్నాడు.
undefined
మోనాల్ తన తండ్రిని కోల్పోయారు. ఇప్పటికీ నాన్న అంటే ఆమెకు బాగా సెంటిమెంట్ తో పాటు ఎమోషనల్ అవుతారు.
undefined
కాగా తండ్రితో పాటు మోనాల్ ఫోటో దిగినట్లు ఓ ఆర్ట్ ఫోటో రూపొందించి మోనాల్ కి ఇవ్వడం జరిగింది.  తండ్రి పక్కన పెళ్లి కూతురులా అలకంరించుకొని ఉన్న మోనాల్ అద్భుతంగా ఉంది.
undefined
ఓంకార్ అందించిన ఈ గిఫ్ట్ తనకు ఎంతో నచ్చిందని, స్టార్ మా తో పాటు డాన్స్ ప్లస్ షోకి, ఆ ఫోటో రూపొందించిన ఆర్టిస్ట్స్  కి ఆమె ధనవ్యవాదాలు తెలిపారు.
undefined
మరో వైపు హౌస్ నుండి బయటికి వచ్చాక కూడా మోనాల్ అఖిల్ తో బంధం కొనసాగిస్తోంది. తరచుగా కలుస్తూ పార్టీలు చేసుకుంటున్న ఈ జంట కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
undefined
click me!