వర్షం మూవీ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పాలబుగ్గల కుర్రాడికి మీసాలు వచ్చేశాయి. మల్టీ టాలెంటెడ్ గా పలు రంగాల్లో రాణిస్తున్నాడు.
వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు?
2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు అక్షయ్ బచ్చు. పృథ్విరాజ్, ప్రభుదేవా, సునీల్ మీద అక్షయ్ బచ్చు వేసే పంచులు భలే పేలాయి. అక్షయ్ బచ్చు ఎమోషన్ తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. అలాగే 2004లో విడుదలైన వర్షం మూవీలో అక్షయ్ బచ్చు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. వర్షం మూవీలో అక్షయ్ బచ్చు హీరో ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేశాడు.
తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయిన ప్రేక్షకుల మదిలో ముద్ర వేశాడు. అక్షయ్ బచ్చు హిందీలో పలు చిత్రాల్లో నటించాడు. సీరియల్స్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ గ్యాప్ తీసుకుని చదువు మీద దృష్టి పెట్టాడు. చదువు పూర్తి అయ్యాక మరలా కెరీర్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం అక్షయ్ బచ్చు నటుడిగా, సింగర్ గా రాణిస్తున్నాడు. అక్షయ్ బచ్చు ప్రొఫెషనల్ సింగర్ కూడాను. ప్లే బ్యాక్ సింగర్ గా కొన్ని చిత్రాలకు పని చేశాడు.
అలాగే క్యాస్టింగ్ మేనేజర్ గా కూడా పని చేస్తున్నాడు. అజయ్ దేవ్ గణ్ హీరోగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ రుద్ర సిరీస్ కి క్యాస్టింగ్ మేనేజర్ గా పని చేశాడు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న రుద్ర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించిన బ్లర్ చిత్రానికి కూడా అక్షయ్ బచ్చు క్యాస్టింగ్ మేనేజర్ గా వ్యవహరించాడు. తక్కువ వయసులోనే పలు రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు.