ఇంట్లో మ్యాంగో షేక్ ను ఎలా తయారుచేయాలో తెలుసా?

First Published | May 19, 2024, 3:30 PM IST

ముందే ఇది మామిడి పండ్ల సీజన్. ఇంకేముంది మామిడి పండ్లను తినడంతో పాటుగా మామిడితో చేసిన రకరకాల రెసిపీలను కూడా ట్రై చేస్తుంటారు. వీటిలో మ్యాంగో షేక్ ఒక్కటి. ఈ మ్యాంగో షేక్ ఎంత టేస్టీగా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని బయటే కొని తాగాలి. కానీ దీన్ని చాలా ఈజీగా ఇంట్లోనే తయారుచేయొచ్చు. అదెలాగంటే. 
 

జ్యూసీ, తీయగా ఉండే మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. నిజానికి ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అందుకే మామిడి పండ్లను రకరకాలుగా తీసుకుంటుంటారు. వీటిలో మ్యాంగో షేక్ ఒక్కటి. ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ మ్యాంగో షేక్ ను ఖచ్చితంగా తాగుతారు. అయితే దీన్ని చాలా మటుకు బయటే తాగుతుంటారు. కానీ బయటకంటే మన ఇంట్లోనే తయారుచేసుకుని తాగడం ఆరోగ్యానికి మంచిది. అందుకే ఈ రోజు ఈ మ్యాంగో షేక్ ను ఇంట్లో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కావాల్సిన పదార్థాలు

పండిన మామిడి పండ్లు - 2

చల్లటి పాలు - 2 కప్పులు

పంచదార -  1 టేబుల్ స్పూన్ (రుచిని బట్టి సర్దుబాటు చేయండి)

యాలకుల పొడి - చిటికెడు (ఆప్షనల్)
ఐస్ క్యూబ్స్ - ఇష్టం 

మామిడి ముక్కలు లేదా పుదీనా ఆకులు గార్నిష్ చేయడానికి (ఆప్షనల్)



తయారీవిధానం

ముందుగా మామిడి పండ్లను బాగా కడగండి. తర్వాత మామిడి పండ్ల తొక్కను తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయండి. మ్యాంగో షేక్ టేస్టీగా రావాలంటే మాత్రం మీరు తీయగా, బాగా పండిన పండ్లనే ఉపయోగించాలి. ఆ తర్వాత బ్లెండర్ లో మ్యాంగో క్యూబ్స్ ను వేయండి. దీన్ని చల్లని పాలలో పోయండి. అయితే తక్కువ కొవ్వు లేదా మొక్కల ఆధారిత పాలను ఉపయోగించండి. ఆ తర్వాత పంచదారను దీనిలో కలపండి. అయితే మామిడి పండ్లు మరీ తీయగా ఉంటే చక్కెరను మోతాదులో వేయండి. లేదా మొత్తమే వేయకపోయినా ఏమీ కాదు. మసాలా దినుసులు నచ్చితే చిటికెడు యాలకుల పొడి వేసి బ్లెండర్ లో పోసి బాగా బ్లెండ్ చేయండి.దీన్ని ఒక గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ ను వేయండి. అంతే చల్లచల్లగా ఉండే మ్యాంగో షేక్ రెడీ అయినట్టే. 

ఈ మ్యాంగో షేక్ ను మీరు కొన్ని మామిడి ముక్కలు లేదా పుదీనా ఆకులతో గార్నిష్ చేయొచ్చు.  అయితే ఈ మ్యాంగో షేక్ ను వెంటనే తాగితే టేస్ట్ బాగుంటుంది. మ్యాంగో షేక్ ను తయారుచేయడానికి అల్ఫోన్సో లేదా అటాల్ఫో మామిడి పండ్లను ఉపయోగించండి. ఎందుకంటే ఇవి చాలా తీయగా, టేస్టీగా ఉంటాయి. 

Latest Videos

click me!