దేవుడికి ఏ పువ్వును సమర్పించకూడదు?

First Published May 19, 2024, 2:30 PM IST

పూజా సమయంలో నైవేధ్యంతో పాటుగా పువ్వులను కూడా దేవతలకు,దేవుళ్లకు సమర్పిస్తుంటాం. దీనివల్ల మన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అయితే దేవుళ్లకు, దేవతలకు కొన్నిరకాల పువ్వులను అస్సలు సమర్పించకూడదు. ఒకవేల సమర్పించినా మీకుపూజ చేసిన ఫలం కూడా దక్కదు. 
 

puja

సనాతన విశ్వాసాల ప్రకారం.. పూజ మన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. పూజ మన జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రతి దేవతకు ఇష్టమైన పువ్వులను సమర్పిస్తుంటాం. ఇది ఆరాధకుడిపై ఆరాధ్య దైవం ఆశీర్వాదాలను ఉంచడానికి పూజ సమయంలో సమర్పించబడుతుంది. కానీ పువ్వులను సమర్పించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి విరుద్దంగా చేస్తే మాత్రం మీకు దేవుడి అనుగ్రహం లభించదు. దేవుళ్లకు, దేవతలకు కొన్ని రకాల పువ్వులను పొరపాటున కూడా సమర్పించకూడదు. ఒకవేళ సమర్పించినా పూజా ఫలం మాత్రం దక్కదు.
 

ఇలాంటి పువ్వులను సమర్పించకూడదు

చెట్టుపై పెరిగే పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి. అయితే ఎండిపోయిన, వాడిపోయిన, ఇంట్లో తెచ్చి పెట్టిన, కీటకాలున్న పువ్వులను పొరపాటున కూడా దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల మీపై దేవుడి అనుగ్రహం ఉండదు. అలాగే దేవుడికి కోపం కూడా వస్తుంది. అలాగే మీకు పూజా ఫలం కూడా దక్కదు. 
 

Latest Videos


ఈ విషయాన్ని గుర్తుంచుకోండి

పువ్వులను దేవుడికి సమర్పించే ముందు వాటి వాసన పొరపాటున కూడా చూడకూడదు. మీరు ఈ పువ్వుల వాసన చూస్తే ఆ పువ్వు అపవిత్రంగా పరిగణించబడుతుంది. వీటితో పాటుగా నేలపై పడే పువ్వును కానీ, పాద పుష్పాన్ని కానీ దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల మీకు పూజ చేసిన ఫలం కూడా దక్కదు.

ఈ సమయంలో పూలు కోయకూడదు

దేవుళ్లకు, దేవతలకు పూలు సమర్పించడానికి రాత్రిపూట మాత్రం పువ్వులను కోయకూడదు. ఎందుకంటే చెట్లు, మొక్కలు కూడా రాత్రిపూట నిద్రిస్తాయని నమ్ముతారు. అలాగే  దేవుడు ఎన్నో చెట్లలో నివసిస్తున్నాడని కూడా నమ్ముతారు. రాత్రిపూట మీరు పువ్వులను కోస్తే వారి నిద్రను పాడు చేసినట్టు అవుతుంది. ఇలాంటి పువ్వులను దేవుడికి సమర్పించడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

click me!